News October 12, 2025
ప్రత్తిపాడు: ఎక్కడ చదివిందో.. అక్కడే టీచర్‌గా..!

ప్రత్తిపాడు మండలం చింతలూరు గ్రామానికి చెందిన పండ్రాడ అపర్ణ ఇటీవల జరిగిన ఏపీ డీఎస్సీ పరీక్షలో స్కూల్ అసిస్టెంట్ విభాగంలో 69వ ర్యాంక్ సాధించారు. తాను చదువుకున్న చింతలూరు ప్రభుత్వ పాఠశాలలోనే పోస్టింగ్ దక్కింది. తాను చదువుకున్న పాత క్లాస్‌రూమ్‌లోనే ఇప్పుడు టీచర్‌గా విధులు నిర్వహించనుంది. దీంతో అపర్ణకు ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందనలు తెలుపుతున్నారు. ఆమె విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
Similar News
News October 12, 2025
మెదక్: మీ వ్యక్తిగత డేటాకు గ్యారంటీ లేదు.. జర జాగ్రత్త..!

ఇంట్లో వాడి వదిలేసిన ఫోన్లను మొబైల్ షాపులకు లేదా తెలియని వ్యక్తులకు అమ్మడం ప్రమాదకరమని MDK అధికారులు సూచిస్తున్నారు. నేరగాళ్లు ఆ ఫోన్లలోని IMEI నంబర్లు, మదర్ బోర్డులు, సాఫ్ట్‌వేర్ సేకరించి సైబర్ మోసాలకు వినియోగిస్తున్నారని, ఈ పరికరాల ద్వారా బ్యాంక్ మోసాలు, డేటా చోరీలు, ఆన్‌లైన్ నేరాలు పెరుగుతున్నాయని హెచ్చరించారు. పాత మొబైల్ అమ్మే ముందు డేటాను పూర్తిగా డిలీట్ చేసి, ఫ్యాక్టరీ రీసెట్ చేయాలన్నారు.
News October 12, 2025
ఏపీ టాస్క్ ఫోర్స్ కి నాయకుడు వచ్చేనా..?

శేషాచలంలో లభించే విలువైన ఎర్రచందనం అక్రమ రవాణా కోసం డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో RSASTF ను చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. 2014 నుంచి 2019 వరకు డీఐజీ నుంచి ఐజీకి పదోన్నతి పొందిన డాక్టర్ కాంతారావు విశేష సేవలు అందించారు. ఆయన బదిలీ అయిన తరువాత ఎస్పీ స్థాయి అధికారుతోనే టాస్క్ ఫోర్స్ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన ఈ టాస్క్ ఫోర్స్ ను బలోపేతం చేయాలని పలువురు కోరుతున్నారు.
News October 12, 2025
‘కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టండి’

కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని రాధా-రంగా మిత్ర మండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జిల్లాల పునర్విభజన కమిటీ సభ్యులైన మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. రంగా పేరుతో జిల్లా పట్టాలని గత ప్రభుత్వానికి 7వేల దరఖాస్తులు ఇచ్చినా పెడ చెవిన పెట్టిందన్నారు.