News October 12, 2025

HYD: ఒక్క రోజు పిల్లల కోసం కేటాయించండి

image

పోలీయో.. బాడీలో ఏంజరుగుతుందో తెలిసేలోపే అంతా అయిపోతుంది. అంగవైఖల్యం పిల్లల జీవితాన్ని చిదిమేస్తుంది. 2 చుక్కలతో నిండు జీవితాన్ని మహమ్మారి నుంచి రక్షించండి. పనులు పక్కనబెట్టి నేడు ఉ.7గం.నుంచి పోలీయో డ్రాప్స్ వేయించండి. HYDలోని అంగన్వాడీలు,ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో వేస్తారు. రైల్వే, మెట్రో స్టేషన్‌తో సహా అధికారులు 2,586 బూతూలు ఏర్పాటుచేశారు. జిల్లాలో 5,17,238 మంది బాలలు ఉన్నారు.

Similar News

News October 12, 2025

జూబ్లీహిల్స్ అడ్డా.. ఎవరిది బిడ్డా..?

image

HYD జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అటు BRS, ఇటు కాంగ్రెస్ జోరు పెంచాయి. నువ్వానేనా అన్నట్లు రేసులో పరుగెత్తుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని డివిజన్లు, ఏరియాలకు MLAలు, MLCలు, మాజీ MLAలను ఇన్‌ఛార్జులుగా BRS నియమించడంతో వారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి మంత్రులు, స్టేట్ లీడర్లు రంగంలోకి దిగి డివిజన్ల వారీగా పర్యటిస్తున్నారు. జూబ్లీహిల్స్ థగ్ ఆఫ్ వార్‌లో గెలిచేదెవరో?

News October 12, 2025

HYD: గిజిగాడి గూడు.. కనువిందు చేసే చూడు

image

కాంక్రీట్ మయమైన సమాజంలో పక్షుల కిలకిలరావాలకు సగటు మనిషి దూరమవుతున్నాడు. నాడు పొద్దు పొద్దునే కోడి కూతతో మొదలయ్యే జీవన ప్రమాణశైలి క్రమంగా ఆలారమ్ కూతకు పరిమితం అయింది. పట్టణీకరణలో భాగంగా చెట్లు, గుట్టలను ధ్వంసం చేయడంతో జీవరాసుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. నగర శివారులోని తారామతిపేటలో గిజిగాడి గూడు కనువిందు చేస్తోంది. అవి చేసే ధ్వనులను, వాటి గూడు అల్లికలు బాటసారులు ఆస్వాదిస్తున్నారు.

News October 12, 2025

HYD: మటన్ గ్రాముకు @ రూపాయి..!

image

నగరంతో సహా శివారులో మటన్ ధరలు ఆకాశాన్నంటాయి. ఒకప్పుడు ఆదివారపు విందుగా ఉన్న మటన్ ఇప్పుడు విలాస వంటకంగా మారింది. నెల రోజులుగా కిలో మటన్ ధర రూ.1000గా కొనసాగుతోంది. మేకలు, గొర్రెల కొరత, రవాణా వ్యయాలు అధికమవ్వడంతో ధరలు పెరుగుతున్నాయని దుకాణదారులు చెబుతున్నారు. ఇంత ఖరీదైనప్పటికీ గసగసాలు వేసి గుమగుమలాడే యాట కర్రీ వండటానికి ప్రజలు వెనుకాడటం లేదు. దుకాణాల వద్ద భారీగా క్యూ ఉంటోంది. మీ ప్రాంతంలో ధర ఎంతుంది?