News October 12, 2025

గ్యాస్ లీక్ ఘటనలో ముగ్గురి మృతి

image

వెల్దుర్తి మండలం బోయనపల్లెలో గత ఆదివారం గ్యాస్ లీకై మంటలు వ్యాపించిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. నాగరాజు, ఆయన భార్య సువర్ణ, పిల్లలు చరణ్, అనిల్‌ తీవ్ర గాయాలతో కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా శుక్రవారం ఉదయం నాగరాజు, అదే రోజు రాత్రి చరణ్ మరణించారు. శనివారం మధ్యాహ్నం వారి అంత్యక్రియలు జరుగుతుండగానే గర్భిణి సువర్ణకు అబార్షన్ అయ్యింది. అనంతరం ఆమె కూడా మరణించింది. అనిల్ చికిత్స పొందతున్నాడు.

Similar News

News October 12, 2025

PDPL: భర్తకు తెలీకుండా ‘చిరంజీవి’తో మాట్లాడేది..!

image

PDPL(D) సెంటినరీ కాలనీలో <<17967599>>మీసేవ నిర్వహకుడు చిరంజీవి<<>> శుక్రవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. కాగా, మృతుడితో కమాన్‌పూర్(M) పెంచికల్పేటకు చెందిన సంధ్యారాణి భర్తకు తెలీకుండా చాటింగ్ చేస్తూ ఫోన్లో మాట్లాడేది. ఈమె ఓ పనిపై మీసేవకు రాగా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో కొద్దిరోజులుగా సంధ్యారాణి చిరంజీవితో మాట్లాడట్లేదు. ఆగ్రహించిన అతడు వేధిస్తుండటంతో సంధ్యారాణి భర్త, అన్న, తండ్రితో మర్డర్ చేయించింది.

News October 12, 2025

తిన్న వెంటనే స్నానం చేస్తున్నారా?

image

భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం చాలా మందికి అలవాటు. అయితే ఆ పద్ధతి ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. తిన్న వెంటనే స్నానం చేస్తే ఆహారం సరిగా జీర్ణం కాదని, జీర్ణ సమస్యలు వస్తాయని అంటున్నారు. భోజనం చేశాక గంట నుంచి గంటన్నర తర్వాత స్నానం చేయాలని సూచించారు. అవి కూడా గోరువెచ్చని నీళ్లు అయితే బెటర్ అని చెబుతున్నారు.
Share it

News October 12, 2025

HYD: తల్లితండ్రుల్లారా? వేధింపులకు గురైతే కాల్ చేయండి

image

తల్లిదండ్రులపై వేధింపులు పెరుగుతున్నాయి. HYDలో 2025లో సెప్టెంబర్ నెలనాటికి తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేసిన కేసులు నమోదయ్యాయి. HYDలో అనేక వృద్ధాశ్రమాలు ఉన్నాయి. 15 ఉచిత సేవలు అందిస్తున్నాయి. వృద్ధులు ఇబ్బందులు పడితే ఫిర్యాదు చేయొచ్చని అధికారులు తెలిపారు. HYD 74166 87878, RR 95156 78010, MDCL 94924 09781 కాల్ చేయండి.