News October 12, 2025
వారినే వరించనున్న.. ఖమ్మం DCC, నగర అధ్యక్ష పదవి

ఖమ్మం DCC, నగర అధ్యక్షుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. ఈ మేరకు AICC పరిశీలకుడు మహేంద్రన్ నేతల అభిప్రాయాలు సేకరించారు. ఈనెల 19 వరకు నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశమై, దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆరేళ్ల తర్వాత ఈ పదవులకు దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో ఆసక్తి నెలకొంది. పార్టీని మొదటి నుంచి నమ్ముకున్న వారికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ పదవులు ఎవరికిస్తే బాగుంటుంది. కామెంట్.
Similar News
News October 11, 2025
ఖమ్మం: బావిలో పడి రైతు మృతి

తిరుమలాయపాలెం మండలం పడమటితండాకు చెందిన రైతు భూక్య భద్రు (కోటి) శనివారం తన వ్యవసాయ క్షేత్రంలోని బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. పనులు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 11, 2025
ప్రజా పాలనలో గ్రామాలు దూసుకెళ్తున్నాయ్: పొంగులేటి

నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలా కాకుండా తమ ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకు వెళుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు, కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.
News October 11, 2025
ఖమ్మం: LRSలో న్యాయం చేయాలి: బాధితులు

ప్లాట్లను క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించిన LRS తప్పుల తడకగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తప్పుడు లెక్కలతో ల్యాండ్ వాల్యూ ఎక్కువగా నమోదు చేయడంతో అనేక మంది రూ.వేలు, లక్షల అదనంగా చెల్లించి నష్టపోయారు. అదనంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించే దిశగా అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని, తక్షణమే తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.