News October 12, 2025

మచిలీపట్నంలో నేటి నాన్ వెజ్ ధరలు ఇవే.!

image

మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. కేజీ చికెన్ ధర రూ. 200 ఉండగా స్కిన్‌లెస్ రూ. 220కి విక్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విత్ స్కిన్ కేజీ రూ. 220, స్కిన్‌లెస్ కేజీ రూ. 240కి అమ్ముతున్నారు. అదే విధంగా మటన్ పల్లె ప్రాంతాల్లో కిలో ధర రూ. 800 ఉండగా.. పట్టణంలో కేజీ మటన్ ధర రూ.1000గా ఉంది. మరి మీ ప్రాంతంలో ధరలు ఏవిధంగా ఉన్నాయో కామెంట్ చేయండి.

Similar News

News October 12, 2025

‘కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టండి’

image

కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని రాధా-రంగా మిత్ర మండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జిల్లాల పునర్విభజన కమిటీ సభ్యులైన మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. రంగా పేరుతో జిల్లా పట్టాలని గత ప్రభుత్వానికి 7వేల దరఖాస్తులు ఇచ్చినా పెడ చెవిన పెట్టిందన్నారు.

News October 12, 2025

ఈనెల 13 నుంచి సూపర్ సేవింగ్స్‌పై షాపింగ్ ఉత్సవం: జేసీ

image

మచిలీపట్నం జెడ్పీ కన్వెన్షన్ హాల్‌లో ఈ నెల 13 నుంచి 19 వరకు జరుగనున్న ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’ షాపింగ్ ఉత్సవాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు జిల్లా అధికారులందరితో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

News October 11, 2025

ధాన్యం సేకరణలో పారదర్శకత పాటించాలి: కలెక్టర్

image

జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో గ్రామ వ్యవసాయ సహాయకులు, టెక్నికల్ అసిస్టెంట్లకు ధాన్యం సేకరణపై అవగాహన శిక్షణ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ నవీన్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతుల నుంచి ధాన్యం సేకరణలో పారదర్శకత పాటించాలన్నారు. ధాన్యం తేమ శాతం, నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పరిశీలించి సేకరణ చేయాలని సూచించారు.