News October 12, 2025
నల్గొండ: 106 మంది నుంచి రూ.46 కోట్లు?

అధిక వడ్డీ ఆశ చూపి అమాయక ప్రజలను మోసం చేసిన వడ్డీ వ్యాపారి బాలాజీపై గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పెద్దఅడిశర్లపల్లి మండలంలోని పలు గ్రామాల నుంచి సుమారు 12 మంది భాధితుల ఫిర్యాదు చేసినట్లు గుడిపల్లి పోలీసులు తెలిపారు. అతని సెల్‌ఫోన్లో ఉన్న సమాచారం ఆధారంగా 106 మంది నుంచి రూ.46 కోట్లు తీసుకున్నట్లు ప్రాథమికంగా తేలింది.
Similar News
News October 12, 2025
సిద్దిపేట: ధాన్యం ఆరబెట్టే యంత్రాలతో రైతులకు తప్పనున్న తిప్పలు

పండించిన పంటలను విక్రయించే సమయంలో తేమ శాతం తగ్గించేందుకు రైతులు యుద్ధం చేయాల్సి వస్తోంది. దీంతో రైతుల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ప్రయోగాత్మకంగా ఆటోమేటిక్ డ్రయర్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలి విడతలో ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ప్రతి జిల్లాకు 2 నుంచి 4 డ్రయర్లను కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం ప్రవీణ్ వెల్లడించారు.
News October 12, 2025
MDK: ఎన్నికల జోరు మాయం.. చాయ్ వాసన మసకబారింది!

స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడటంతో అభ్యర్థుల్లో నిరాశ అలుముకుంది. నాలుగైదు రోజులుగా ప్రచారానికి భారీగా ఖర్చు చేసిన నేతలు ఇప్పుడు చల్లబడ్డారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొన్ని మండలాల్లో నేతలు ఇప్పుడు చాయ్ చర్చలకైనా కనిపించడం లేదు. ఇంకొందరు “ఇప్పుడేం తొందర లేదు, మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైతే దావత్ చేసుకుందాం” అంటూ సరదాగా మాట్లాడుకుంటున్నారు.
News October 12, 2025
PDPL: భర్తకు తెలీకుండా ‘చిరంజీవి’తో మాట్లాడేది..!

PDPL(D) సెంటినరీ కాలనీలో <<17967599>>మీసేవ నిర్వహకుడు చిరంజీవి<<>> శుక్రవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. కాగా, మృతుడితో కమాన్‌పూర్(M) పెంచికల్పేటకు చెందిన సంధ్యారాణి భర్తకు తెలీకుండా చాటింగ్ చేస్తూ ఫోన్లో మాట్లాడేది. ఈమె ఓ పనిపై మీసేవకు రాగా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో కొద్దిరోజులుగా సంధ్యారాణి చిరంజీవితో మాట్లాడట్లేదు. ఆగ్రహించిన అతడు వేధిస్తుండటంతో సంధ్యారాణి భర్త, అన్న, తండ్రితో మర్డర్ చేయించింది.