News October 12, 2025
సచివాలయం ప్రాంతంలో 7 కుక్కలు పట్టివేత

సచివాలయంలో కుక్కలు పరిసర ప్రాంతాల్లో స్వైర విహారం చేశాయి. పలు మీడియాలో వార్త కథనాలు రావడంతో అధికారులు స్పందించారు. తెలంగాణ సచివాలయంలో 7 కుక్కలను మున్సిపాలిటీ అధికారులు పట్టుకున్నారు. ప్రజలను కరిచిన ఓ కుక్క కోసం గాలిస్తున్నారు. సచివాలయంలో కుక్కలను పట్టుకోవడానికి మరో బృందాన్ని అధికారులు దింపారు.
Similar News
News October 12, 2025
HYD: పెద్దాసుపత్రి.. డెడ్‌బాడీలు ఫ్రీగా పంపలేని పరిస్థితి!

HYD గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల నుంచి డెడ్ బాడీలను ఇంటికి తీసుకెళ్లే కష్టాలు తప్పటం లేదు. ఉస్మానియాలో నిత్యం 25 నుంచి 35 మంది మరణిస్తున్నారు. కానీ.. ఉచిత అంబులెన్స్ సేవలు సరైన సంఖ్యలో లేకపోవడంతో కడచూపు కష్టంగా మారుతోంది. వేలు ఖర్చు పెట్టీ డెడ్‌బాడీని ప్రైవేట్ అంబులెన్స్ వాహనాల్లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఒక్కో ఆస్పత్రికి 20 ఉచిత అంబులెన్సులు అందుబాటులోకి తేవాలని బాధితులు కోరుతున్నారు.
News October 12, 2025
జూబ్లీహిల్స్ అడ్డా.. ఎవరిది బిడ్డా..?

HYD జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అటు BRS, ఇటు కాంగ్రెస్ జోరు పెంచాయి. నువ్వానేనా అన్నట్లు రేసులో పరుగెత్తుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని డివిజన్లు, ఏరియాలకు MLAలు, MLCలు, మాజీ MLAలను ఇన్‌ఛార్జులుగా BRS నియమించడంతో వారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి మంత్రులు, స్టేట్ లీడర్లు రంగంలోకి దిగి డివిజన్ల వారీగా పర్యటిస్తున్నారు. జూబ్లీహిల్స్ థగ్ ఆఫ్ వార్‌లో గెలిచేదెవరో?
News October 12, 2025
HYD: గిజిగాడి గూడు.. కనువిందు చేసే చూడు

కాంక్రీట్ మయమైన సమాజంలో పక్షుల కిలకిలరావాలకు సగటు మనిషి దూరమవుతున్నాడు. నాడు పొద్దు పొద్దునే కోడి కూతతో మొదలయ్యే జీవన ప్రమాణశైలి క్రమంగా ఆలారమ్ కూతకు పరిమితం అయింది. పట్టణీకరణలో భాగంగా చెట్లు, గుట్టలను ధ్వంసం చేయడంతో జీవరాసుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. నగర శివారులోని తారామతిపేటలో గిజిగాడి గూడు కనువిందు చేస్తోంది. అవి చేసే ధ్వనులను, వాటి గూడు అల్లికలు బాటసారులు ఆస్వాదిస్తున్నారు.