News October 12, 2025
GNT: జాతీయ రహదారిపై ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

మంగళగిరి జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గుంటూరు వైపు నుంచి విజయవాడకు స్కూటీపై వెళ్తున్న వారిని లారీ ఢీకొట్టింది. దీంతో వారు రోడ్డుపై పడ్డారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో భారీ వాహనం వారిపై నుంచి వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై మంగళగిరి పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News October 12, 2025
పాప్ స్టార్‌తో కెనడా మాజీ ప్రధాని డేటింగ్!

అమెరికన్ పాప్ సింగర్ కేటీ పెర్రీతో కెనడా Ex PM జస్టిన్ ట్రూడో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. US కాలిఫోర్నియాలో ఓ బోటులో విహరిస్తుండగా పెర్రీని ట్రూడో కిస్ చేస్తున్న ఫొటో వైరల్ అవుతోంది. గత జులైలో డిన్నర్ డేట్ సందర్భంగా వీరు తొలిసారి కలిసి కనిపించారు. 2023లో భార్య సోఫీ నుంచి ట్రూడో విడిపోగా, నటుడు ఒర్లాండోతో నిశ్చితార్థాన్ని 2025 జూన్‌లో పెర్రీ రద్దు చేసుకున్నారు.
News October 12, 2025
HYD: పెద్దాసుపత్రి.. డెడ్‌బాడీలు ఫ్రీగా పంపలేని పరిస్థితి!

HYD గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల నుంచి డెడ్ బాడీలను ఇంటికి తీసుకెళ్లే కష్టాలు తప్పటం లేదు. ఉస్మానియాలో నిత్యం 25 నుంచి 35 మంది మరణిస్తున్నారు. కానీ.. ఉచిత అంబులెన్స్ సేవలు సరైన సంఖ్యలో లేకపోవడంతో కడచూపు కష్టంగా మారుతోంది. వేలు ఖర్చు పెట్టీ డెడ్‌బాడీని ప్రైవేట్ అంబులెన్స్ వాహనాల్లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఒక్కో ఆస్పత్రికి 20 ఉచిత అంబులెన్సులు అందుబాటులోకి తేవాలని బాధితులు కోరుతున్నారు.
News October 12, 2025
పంజాగుట్ట యాక్సిడెంట్ మృతిచెందింది వీరే!

పంజాగుట్ట PS పరిధిలోని గ్రీన్ ల్యాండ్స్ వద్ద తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈప్రమాదంలో రాపిడో డ్రైవర్ ముద్ధంగల్ నవీన్(30) అక్కడికక్కడే మృతి చెందగా.. వెనుక సవారీ చేసిన డాక్టర్ కస్తూరి జగదీష్ చంద్ర(35) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసులు లారీ డ్రైవర్ శంకర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.