News October 12, 2025

పరీక్ష రాశాక ఆన్సర్ షీట్ చూసుకోవచ్చు

image

పోటీ పరీక్షల్లో పారదర్శకత కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ముఖ్య సంస్కరణలు చేసింది. ఇకపై మెరిట్ లిస్టును మార్కులుగా కాకుండా పర్సంటైల్‌గా వెల్లడిస్తుంది. అటు పేపర్ లీకేజీలు జరగకుండా డిజిటల్ వాల్టులు వినియోగించనుంది. ఇక ఆధార్ గుర్తింపుతో అభ్యర్థుల అటెండెన్స్ తీసుకుంటుంది. ముఖ్యంగా ఎగ్జామ్‌లో తమకు వచ్చిన క్వశ్చన్ పేపర్, ఇచ్చిన ఆన్సర్స్, కీ కాపీలను పరీక్ష తర్వాత ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చని తెలిపింది.

Similar News

News October 12, 2025

రుషికొండ ప్యాలెస్ ఎలా వినియోగిద్దాం.. సలహాలు కోరిన ప్రభుత్వం

image

AP: విశాఖపట్నంలో గత ప్రభుత్వం నిర్మించిన రుషికొండ ప్యాలెస్ వినియోగంపై పర్యాటక శాఖ వినూత్న ఆలోచన చేసింది. ఈ భవనాలను ఎలా ఉపయోగిస్తే బాగుంటుందో తెలపాలని ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరింది. rushikonda@aptdc.inకు OCT 17 లోపు మెయిల్ చేయాలని టూరిజం అథారిటీ CEO ఆమ్రపాలి ప్రకటనలో తెలిపారు. పౌరులు, సంస్థల సూచనలను మంత్రుల బృందం సమీక్షించి, నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.

News October 12, 2025

పాప్ స్టార్‌తో కెనడా మాజీ ప్రధాని డేటింగ్!

image

అమెరికన్ పాప్ సింగర్ కేటీ పెర్రీతో కెనడా Ex PM జస్టిన్ ట్రూడో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. US కాలిఫోర్నియాలో ఓ బోటులో విహరిస్తుండగా పెర్రీని ట్రూడో కిస్ చేస్తున్న ఫొటో వైరల్ అవుతోంది. గత జులైలో డిన్నర్ డేట్ సందర్భంగా వీరు తొలిసారి కలిసి కనిపించారు. 2023లో భార్య సోఫీ నుంచి ట్రూడో విడిపోగా, నటుడు ఒర్లాండోతో నిశ్చితార్థాన్ని 2025 జూన్‌లో పెర్రీ రద్దు చేసుకున్నారు.

News October 12, 2025

58 మంది పాక్ సైనికులు హతం: తాలిబన్ ప్రతినిధి

image

అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ మధ్య ఘర్షణల్లో పాక్ సైన్యంలో 58 మంది హతమైనట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాయిద్ తెలిపారు. సరిహద్దు, గగనతల ఉల్లంఘనలకు దీటుగా బదులిచ్చినట్లు చెప్పారు. 25 పాక్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఐసిస్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వొద్దని PAKను హెచ్చరించారు. పాక్ కాబూల్‌లోని ఓ మార్కెట్‌లో బాంబు దాడి చేసినట్లు ఆరోపించారు. దీనికి పాక్ ధ్రువీకరించాల్సి ఉంది.