News October 12, 2025
MBNR: డీసీసీ అధ్యక్షుల నియామకాలపై కాంగ్రెస్ నజర్..!

ఉమ్మడి MBNR జిల్లాలో డీసీసీ అధ్యక్షుల నియామకాలపై కాంగ్రెస్ నజర్ పెట్టింది. అధిష్ఠానం కసరత్తులో జిల్లా ఇన్‌ఛార్జ్‌ల పర్యటన అనంతరం పార్టీ శ్రేణుల ఏకాభిప్రాయంతో డీసీసీ అధ్యక్షులను నియమించాలని కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. ఈనెల 12 నుంచి 16 వరకు అన్ని జిల్లాల్లో ఇన్‌ఛార్జ్‌లు పర్యటించి నిర్ణయం తీసుకుంటున్నట్లు నారాయణపేట జిల్లా ఏఐసీసీ పరిశీలకుడు నారాయణస్వామి తెలిపారు.
Similar News
News October 12, 2025
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు ఆహ్వానం

జాతీయ స్థాయిలో జరిగే సైనిక్ స్కూల్ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 6వ తరగతికి 01.04.2014 నుంచి 31.03.2016 మధ్య జన్మించి ఉండాలి. 9 వ తరగతి ప్రవేశాలకు 01.04.2011 నుంచి 31.03.2013 మధ్య పుట్టిన వారు అర్హులు. ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News October 12, 2025
ప్రజల్లో ‘కల్తీ’ భయం!

దేశంలో కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు అద్దం పడుతున్నాయి. ఇప్పటివరకు పాలు, మద్యం, నిత్యవసరాలు, మెడిసిన్ కల్తీ అవడం చూస్తోండగా తాజాగా <<17975023>>Colgate<<>> ఘటన కలవరపరుస్తోంది. పనీర్, ఈనో, సెన్సోడైన్ వంటివి కూడా కల్తీ అవడం ఈ మధ్యకాలంలో వెలుగుచూశాయి. రసాయనాలు, నాసిరకం పదార్థాలతో వీటి తయారీ ప్రాణాలపైకి తీసుకొస్తుంది. దీంతో ఏది కల్తీనో ఏదీ నిజమైనదో తెలియక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
News October 12, 2025
వరంగల్: జీవాంజీ దీప్తికి గోల్డ్ మెడల్..!

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరుగుతున్న వర్ట్చూస్ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్- 2025లో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన పారా అథ్లెట్ జీవాంజీ దీప్తి గోల్డ్ మెడల్ సాధించారు. మూడు రోజులుగా జరుగుతున్న పోటీల్లో శనివారం క్వాలిఫైయింగ్ రౌండ్ పూర్తి చేయగా, ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో దీప్తిని కోచ్‌తో పాటు తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందించారు.