News October 12, 2025
నారద భక్తి సూత్రాలు – 6

‘యత్ జ్ఞాత్వా మత్తో భవతి, స్తబ్ధో భవతి, ఆత్మారామోభవతి’ అనే దివ్య వాక్యం భక్తి ఉన్నత స్థితిని వివరిస్తుంది. దేనిని తెలుసుకుంటే భక్తుడు నిశ్చలమైనవాడై ఆత్మలోనే ఆనందాన్ని పొందుతాడో అదే ‘భగవత్ ప్రేమ’. అది కల్గినవారికి లౌకిక విషయాలపై వ్యామోహం పోయి, మనసు స్థిరత్వం పొందుతుంది. భగవంతుడి జ్ఞానాన్ని పొందిన భక్తుడు, తన సంతోషం కోసం బాహ్య ప్రపంచంపై ఆధారపడకుండా, ఆత్మలోనే శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాడు. <<-se>>#NBS<<>>
Similar News
News October 12, 2025
రుషికొండ ప్యాలెస్ ఎలా వినియోగిద్దాం.. సలహాలు కోరిన ప్రభుత్వం

AP: విశాఖపట్నంలో గత ప్రభుత్వం నిర్మించిన రుషికొండ ప్యాలెస్ వినియోగంపై పర్యాటక శాఖ వినూత్న ఆలోచన చేసింది. ఈ భవనాలను ఎలా ఉపయోగిస్తే బాగుంటుందో తెలపాలని ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరింది. rushikonda@aptdc.inకు OCT 17 లోపు మెయిల్ చేయాలని టూరిజం అథారిటీ CEO ఆమ్రపాలి ప్రకటనలో తెలిపారు. పౌరులు, సంస్థల సూచనలను మంత్రుల బృందం సమీక్షించి, నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.
News October 12, 2025
పాప్ స్టార్‌తో కెనడా మాజీ ప్రధాని డేటింగ్!

అమెరికన్ పాప్ సింగర్ కేటీ పెర్రీతో కెనడా Ex PM జస్టిన్ ట్రూడో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. US కాలిఫోర్నియాలో ఓ బోటులో విహరిస్తుండగా పెర్రీని ట్రూడో కిస్ చేస్తున్న ఫొటో వైరల్ అవుతోంది. గత జులైలో డిన్నర్ డేట్ సందర్భంగా వీరు తొలిసారి కలిసి కనిపించారు. 2023లో భార్య సోఫీ నుంచి ట్రూడో విడిపోగా, నటుడు ఒర్లాండోతో నిశ్చితార్థాన్ని 2025 జూన్‌లో పెర్రీ రద్దు చేసుకున్నారు.
News October 12, 2025
58 మంది పాక్ సైనికులు హతం: తాలిబన్ ప్రతినిధి

అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ మధ్య ఘర్షణల్లో పాక్ సైన్యంలో 58 మంది హతమైనట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాయిద్ తెలిపారు. సరిహద్దు, గగనతల ఉల్లంఘనలకు దీటుగా బదులిచ్చినట్లు చెప్పారు. 25 పాక్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఐసిస్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వొద్దని PAKను హెచ్చరించారు. పాక్ కాబూల్‌లోని ఓ మార్కెట్‌లో బాంబు దాడి చేసినట్లు ఆరోపించారు. దీనికి పాక్ ధ్రువీకరించాల్సి ఉంది.