News October 12, 2025

HYD: రెండు రోజులు నీటి సరఫరా బంద్

image

కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు ఫేజ్-3 పంపింగ్‌కు సంబంధించి భారీ లీకేజీకి మరమ్మతులు చేయనున్న నేపథ్యంలో రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుందని జలమండలి అధికారులు తెలిపారు. కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, వనస్థలిపురం, ఉప్పల్, రాంపల్లి, బోడుప్పల్, సరూర్‌నగర్, బండ్లగూడ, ఉప్పల్, శంషాబాద్, నాగోల్ ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.

Similar News

News October 12, 2025

రుషికొండ ప్యాలెస్ ఎలా వినియోగిద్దాం.. సలహాలు కోరిన ప్రభుత్వం

image

AP: విశాఖపట్నంలో గత ప్రభుత్వం నిర్మించిన రుషికొండ ప్యాలెస్ వినియోగంపై పర్యాటక శాఖ వినూత్న ఆలోచన చేసింది. ఈ భవనాలను ఎలా ఉపయోగిస్తే బాగుంటుందో తెలపాలని ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరింది. rushikonda@aptdc.inకు OCT 17 లోపు మెయిల్ చేయాలని టూరిజం అథారిటీ CEO ఆమ్రపాలి ప్రకటనలో తెలిపారు. పౌరులు, సంస్థల సూచనలను మంత్రుల బృందం సమీక్షించి, నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.

News October 12, 2025

గిన్నీస్ వరల్డ్ రికార్డ్ పోటీల్లో జగిత్యాల యువకుల సత్తా..!

image

తమిళనాడు చెన్నైలో కరాటే మార్షల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ పోటీల్లో జగిత్యాల జిల్లా పెగడపల్లి యువకులు ప్రతిభ చాటారు. మండల కేంద్రానికి చెందిన క్యాస రాజశేఖర్, మండలంలోని నందగిరివాసి గాజుల రాకేశ్ కరాటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ పోటీల్లో పాల్గొని మార్షల్ ఆర్ట్స్‌లో ప్రతిభ కనబర్చడంతో గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకున్నారు.వీరిని పలువురు అభినందించారు.

News October 12, 2025

పాప్ స్టార్‌తో కెనడా మాజీ ప్రధాని డేటింగ్!

image

అమెరికన్ పాప్ సింగర్ కేటీ పెర్రీతో కెనడా Ex PM జస్టిన్ ట్రూడో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. US కాలిఫోర్నియాలో ఓ బోటులో విహరిస్తుండగా పెర్రీని ట్రూడో కిస్ చేస్తున్న ఫొటో వైరల్ అవుతోంది. గత జులైలో డిన్నర్ డేట్ సందర్భంగా వీరు తొలిసారి కలిసి కనిపించారు. 2023లో భార్య సోఫీ నుంచి ట్రూడో విడిపోగా, నటుడు ఒర్లాండోతో నిశ్చితార్థాన్ని 2025 జూన్‌లో పెర్రీ రద్దు చేసుకున్నారు.