News October 12, 2025

అనుబంధాల ఆలయమే పెళ్లి

image

పెళ్లంటే నూరేళ్ల పంట మాత్రమే కాదు. ఏడడుగుల అనుబంధం. ఏడు జన్మల అనురాగం. ఇది రెండు మనసుల పవిత్ర కలయిక. ఇరువురి జీవితాల ప్రేమానురాగాల అల్లిక. తల్లిదండ్రులను మురిపించి, రెండు కుటుంబాల సంతృప్తిని కొనసాగించే గొప్ప సంస్కారం. శాంతి సౌభాగ్యాల ఉద్భవానికి, ‘నా’ అనే తీయని భావనతో కుటుంబాన్ని ఏర్పాటుచేసుకొనే మొదటి సోపానం. ఓర్పు, సహనం అనే పునాదులపై నిర్మితమయ్యే అందమైన అనుబంధాల సౌధమే వివాహం. <<-se>>#Pendli<<>>

Similar News

News October 12, 2025

ఉమెన్స్ వరల్డ్ కప్: భారత్ ఫస్ట్ బ్యాటింగ్

image

ICC ఉమెన్స్ వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టులో మార్పులు చేయలేదు.
IND: ప్రతీకా, మంధాన, హర్లీన్, హర్మన్‌ప్రీత్ (C), జెమీమా, దీప్తి, రిచా, అమన్‌జోత్, రాణా, క్రాంతి, శ్రీ చరణి.
AUS: హేలీ(C), లిచ్‌ఫీల్డ్, పెర్రీ, మూనీ, సదర్లాండ్, గార్డనర్, మెక్‌గ్రాత్, మోలినక్స్, K గార్త్, అలానా, మేగాన్.
– స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు.

News October 12, 2025

Op Sindoor: NSEపై ఒకేరోజు 40 కోట్ల సైబర్ అటాక్స్

image

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)పై రోజూ 17కోట్ల సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ టైమ్‌లో ఏకంగా ఒకేరోజు 40 కోట్ల దాడులు జరిగాయి. వీటిని సమర్థంగా అడ్డుకున్నామని, ఎలాంటి నష్టం జరగలేదని NSE వర్గాలు తెలిపాయి. తమ రెండు సైబర్ డిఫెన్స్ సెంటర్లలోని సాంకేతిక బృందాలు 24/7 పని చేస్తున్నట్లు చెప్పాయి. Op Sindoor సమయంలో తమ సైట్‌ను ఫారినర్స్ యాక్సెస్ చేయకుండా తాత్కాలికంగా రిస్ట్రిక్ట్ చేశామన్నాయి.

News October 12, 2025

రుషికొండ ప్యాలెస్ ఎలా వినియోగిద్దాం.. సలహాలు కోరిన ప్రభుత్వం

image

AP: విశాఖపట్నంలో గత ప్రభుత్వం నిర్మించిన రుషికొండ ప్యాలెస్ వినియోగంపై పర్యాటక శాఖ వినూత్న ఆలోచన చేసింది. ఈ భవనాలను ఎలా ఉపయోగిస్తే బాగుంటుందో తెలపాలని ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరింది. rushikonda@aptdc.inకు OCT 17 లోపు మెయిల్ చేయాలని టూరిజం అథారిటీ CEO ఆమ్రపాలి ప్రకటనలో తెలిపారు. పౌరులు, సంస్థల సూచనలను మంత్రుల బృందం సమీక్షించి, నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.