News October 12, 2025

ఆదిలాబాద్ జిల్లాకు అవార్డుల పంట

image

జాతీయ స్థాయిలో ఆదిలాబాద్ జిల్లా తనదైన గుర్తింపు పొందుతూ అవార్డులను సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే నీతీ ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ద్వారా నార్నూర్ మండలం ఎంపిక కాగా.. ఇటీవల జలసంచాయ్.. జన్ భగీధారి అవార్డును అందుకుంది. కలెక్టర్ రాజర్షి షా ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ లెర్నింగ్ ఫౌండేషన్ ప్రోగ్రాం ‘ఇంప్రూవ్ సాఫ్ట్ స్కిల్స్ ఆమాంగ్ స్టూడెంట్స్’ థీమ్ కింద విజేతగా నిలిచింది. దీంతో మరో అవార్డు జిల్లా ఖాతాలో పడింది.

Similar News

News October 12, 2025

ఆదిలాబాద్‌లో బడా రియాల్టర్లపై కేసు

image

భూ కబ్జా కేసులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా తప్పు చేసిన భూకబ్జా దారులందరిపై కేసులు నమోదు అవుతున్నాయి. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వచ్చాక రియల్టర్‌ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా ఎస్.బి.ఐ బ్యాంకు అధీనంలోని భూమిని కబ్జా చేసిన ఘటనలో ఆదిలాబాద్‌కు చెందిన మామ్లా సెట్, రమేశ్ శర్మతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 12, 2025

ఆదిలాబాద్: డీసీసీ పీఠం కోసం పోటీ

image

ఆదిలాబాద్ డీసీసీ పీఠం కోసం జిల్లా నేతలు పోటీ పడుతున్నారు. స్థానిక ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం డీసీసీలపై దృష్టి సారించింది. ఆదిలాబాద్ నుంచి డీసీసీ రేసులో గండ్రత్ సుజాత, గోక గణేష్ రెడ్డి, కంది శ్రీనివాస్ రెడ్డి, ఆడే గజేందర్, అడ్డి బోజారెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరీ అధిష్టానం ఎవరికి పీఠం కట్ట బెడుతుందో చూడాలి.

News October 12, 2025

ADB: అన్నదాతలకు గమనిక.. పంటల మద్దతు ధరలివే..!

image

కేంద్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి సంబంధించి పంటల ధరలు నిర్ణయించింది. మరి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడిప్పుడే వానాకాలం పంటలు చేతికి వస్తున్నాయి. అధికంగా సాగు చేసే పత్తిలో మధ్యరకం పింజ కలిగిన దానికి క్వింటాకు రూ.7,710, పొడవురకానికి రూ.8,110, వరి సాధారణ రకానికి రూ.2,369, ఏ గ్రేడ్‌కు రూ.2,389, జొన్నలు హైబ్రిడ్‌కు రూ.3,699, మాల్ దండికి రూ.3,749, సోయా రూ.5,328, కంది రూ.8,000గా నిర్ణయించారు.

SHARE IT