News October 12, 2025
స్వీట్లు తినిపించి ముగ్గురు పిల్లల గొంతు కోసిన తండ్రి

ఇన్‌స్టా పరిచయం కుటుంబాన్ని నాశనం చేసింది. తమిళనాడుకు చెందిన వినోద్, నిత్యకు 12 ఏళ్ల క్రితం పెళ్లవ్వగా ముగ్గురు పిల్లలు ఉన్నారు. వినోద్‌కు వ్యాపారంలో నష్టాలు రాగా అదే సమయంలో నిత్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతడితో సంబంధం పెట్టుకుని భర్త, పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. ఎంత బతిమాలినా రాకపోవడంతో తాగుడు బానిసైన వినోద్ నిన్న పిల్లలకు స్వీట్లు తినిపించి గొంతు కోసి చంపేశాడు.
Similar News
News October 12, 2025
మామిడి.. అక్టోబర్‌లో తీసుకోవాల్సిన చర్యలు

మామిడిలో కొమ్మ ఎండు, ఆకు మచ్చ తెగుళ్ల నివారణకు ఈనెలలో పలు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముందుగా చెట్లకు నీరు పెట్టడం ఆపేయాలి. ఎండిన కొమ్మలు, ఆకులను పూర్తిగా తొలగించాలి. చెట్లకు ఉన్న చెదలును తొలగించి మొదళ్లలో క్లోరిఫైరిఫాస్ నేల బాగా తడిచేలా పోయాలి. కాండం 1 మీటరు ఎత్తువరకు క్లోరిఫైరిఫాస్‌ను పూతలాగా పూయాలి. అలాగే లీటరు నీటికి 1గ్రా.కార్బండిజమ్ కలిపి పిచికారీ చేసుకోవాలి.
News October 12, 2025
ఉమెన్స్ వరల్డ్ కప్: భారత్ ఫస్ట్ బ్యాటింగ్

ICC ఉమెన్స్ వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టులో మార్పులు చేయలేదు.
IND: ప్రతీకా, మంధాన, హర్లీన్, హర్మన్‌ప్రీత్ (C), జెమీమా, దీప్తి, రిచా, అమన్‌జోత్, రాణా, క్రాంతి, శ్రీ చరణి.
AUS: హేలీ(C), లిచ్‌ఫీల్డ్, పెర్రీ, మూనీ, సదర్లాండ్, గార్డనర్, మెక్‌గ్రాత్, మోలినక్స్, K గార్త్, అలానా, మేగాన్.
– స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు.
News October 12, 2025
Op Sindoor: NSEపై ఒకేరోజు 40 కోట్ల సైబర్ అటాక్స్

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)పై రోజూ 17కోట్ల సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ టైమ్‌లో ఏకంగా ఒకేరోజు 40 కోట్ల దాడులు జరిగాయి. వీటిని సమర్థంగా అడ్డుకున్నామని, ఎలాంటి నష్టం జరగలేదని NSE వర్గాలు తెలిపాయి. తమ రెండు సైబర్ డిఫెన్స్ సెంటర్లలోని సాంకేతిక బృందాలు 24/7 పని చేస్తున్నట్లు చెప్పాయి. Op Sindoor సమయంలో తమ సైట్‌ను ఫారినర్స్ యాక్సెస్ చేయకుండా తాత్కాలికంగా రిస్ట్రిక్ట్ చేశామన్నాయి.