News October 12, 2025

ఎర్ర బెండ రకాల్లో ‘కాశీ లాలిమ’ ప్రత్యేకం

image

‘కాశీ లాలిమ’ ఎర్ర బెండను IIVR వారణాసి రూపొందించింది. ఈ కాయలు ఆకర్షణీయంగా ఉంటాయి. దీనికి కాయపుచ్చు పురుగు ముప్పు తక్కువ. దీని వల్ల పురుగు మందుల పిచికారీ అవసరం లేదు. చెట్టు పొట్టిగా ఉంటుంది. అందకే దగ్గర దగ్గరగా మొక్కలు నాటుకోవాలి. కాయపై దురద కలిగించే నూగు ఉండదు. అందుకే ఈ బెండ కాయలను సులభంగా కోయవచ్చు. పల్లాకు వైరస్ తెగులును ఇది సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఈ కాయల్లో జిగురు తక్కువగా ఉంటుంది.

Similar News

News October 12, 2025

నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక అవార్డు

image

NTR ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరిని ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ సంస్థ ఈ డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్ అవార్డు-2025ను ప్రకటించింది. ప్రజాసేవ, సామాజికంగా ప్రభావితం చేసే అంశాల్లో ఆమె సేవలకుగాను ఈ అవార్డు దక్కింది. లండన్‌‌లోని గ్లోబల్‌ కన్వెన్షన్‌లో NOV 4న ఈ అవార్డు అందజేస్తారు. దీనిపై CM చంద్రబాబు ఆమెను అభినందిస్తూ SMలో పోస్టు చేశారు.

News October 12, 2025

రేపు, ఎల్లుండి వర్షాలు

image

TG: కోస్తాంధ్ర తీరంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం ఇవాళ ఉదయం నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి తరలిపోయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు రేపు, ఎల్లుండి రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొంది.

News October 12, 2025

1,149 పోస్టులు.. దరఖాస్తు చేసుకోండి

image

ఈస్ట్ సెంట్రల్ రైల్వే RRC 1,149 అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 25వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు 15నుంచి 24ఏళ్లు గల అభ్యర్థులు అర్హులు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100. SC, ST, PwBD, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. వెబ్‌సైట్: www.ecr.indianrailways.gov.in