News October 12, 2025
WGL: తస్మాత్ జాగ్రత్త.. పాత ఫోన్లను అమ్మకండి!

మీ ఇంట్లో వినియోగించి వదిలేసిన పాత ఫోన్లను ప్లాస్టిక్ సామాన్లకు, మొబైల్ షాపుల్లో, ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతున్నారా? అయితే మీరు సైబర్ నేరగాళ్లకు చిక్కినట్లే. వాటి ఐఎంఈఐ నంబర్లు, మదర్ బోర్డు, సాఫ్ట్వేర్ సేకరించి మరమ్మతు చేస్తారు. ఆ తర్వాత ఆ ఫోన్ల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. కావున వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ విభాగం పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News October 12, 2025
1,149 పోస్టులు.. దరఖాస్తు చేసుకోండి

ఈస్ట్ సెంట్రల్ రైల్వే RRC 1,149 అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 25వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు 15నుంచి 24ఏళ్లు గల అభ్యర్థులు అర్హులు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100. SC, ST, PwBD, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. వెబ్‌సైట్: www.ecr.indianrailways.gov.in
News October 12, 2025
HYD: ఏఐజీ ఘటనపై ఆసుపత్రి నిర్వాహకుల వివరణ

గచ్చిబౌలిలోని AIGలో జరిగిన ఘటనపై ఆసుపత్రి నిర్వాహకులు వివరణ ఇచ్చారు. లివర్ వ్యాధితో మురళీధర్ ఆస్పత్రిలో చేరాడని, డోనర్స్ ముందుకు రాకపోవడంతో ఆపరేషన్ ఆలస్యమైందన్నారు. కుటుంబసభ్యుల అంగీకారంతో ఆపరేషన్ నిర్వహించామని, అనంతరం ఆరోగ్యం మళ్లీ విషమించడంతో ICUకి షిఫ్ట్ చేశామన్నారు. ఇదే సమయంలో కుటుంబసభ్యులు మరో ఆస్పత్రికి తీసుకెళ్తామంటే డిశ్చార్జ్ చేశామని, అతడు చనిపోయే ప్రమాదం ఉందని చెప్పినా వినలేదన్నారు.
News October 12, 2025
HYD: CM బోటీ అమ్ముతుండా?: KTR

కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు KCRను గెలిపించుకోవాలని KTR పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచే BRS జైత్రయాత్ర మొదలవ్వాలన్నారు. 2 ఏళ్లు అభివృద్ధిని పక్కన బెట్టిన రేవంత్ KCRను తిట్టుడే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ‘గుడ్లు పీకి గోలిలాడుతా.. పేగులు మెడలేసుకుంటా అంటుండు. CM బోటీ ఏమైనా అమ్ముతుండా’ అని KTR సెటైర్లు వేశారు. కారు కావాలా? బుల్డోజర్ కావాలో నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు.