News October 12, 2025
భద్రాచలం: పాపికొండల పర్యాటకం పునః ప్రారంభం

జాతీయస్థాయిలో పేరుగాంచిన పాపికొండల విహార యాత్ర అధికారికంగా పునః ప్రారంభమైంది. ఏపీలోని రాజమండ్రి సమీపంలోని గండిపోచమ్మ ఫెర్రీ పాయింట్ నుంచి బోట్లు ఇప్పటికే శనివారం నుంచి ప్రయాణించాయి. కాగా, తెలంగాణ పర్యాటకుల కోసం ఏపీలోని పోచారం నుంచి కూడా బోట్లు ఈ వారంలోనే పునః ప్రారంభం కానున్నట్లు బోటు యజమానులు పేర్కొంటున్నారు. దీంతో పర్యాటక ప్రాంతంలో సందడి నెలకొంది.
Similar News
News October 12, 2025
HYD: రూ.కోట్ల అద్దె ఎగ్గొడుతున్నప్పటికీ.. నోటీసులేనా?

HMDA పరిధిలో రూ.కోట్ల పాయల అద్దెలు ఎగ్గొడుతున్నప్పటికీ HMDA సరిగ్గా వ్యవహరించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలోని ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, సంజీవ పార్క్ తదితర ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక సంస్థలు ఇప్పటి వరకు అద్దె చెల్లించలేదు. కోట్ల బకాయిలు ఉన్నాయి. HMDA మాత్రం నోటీసులకు మాత్రమే పరిమితమవుతుంది.
News October 12, 2025
జనగామ: ఈనెల 25న పత్తి రైతుల రాష్ట్ర సదస్సు

ఈనెల 25న జనగామ జిల్లా కేంద్రంలోని పూసల భవనంలో పత్తి రైతుల రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నారు. పత్తి దిగుమతిపై ఉన్న 11శాతం సుంకాన్ని కొనసాగించాలని, సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని, క్వింటా పత్తికి రూ.10,075 నిర్ణయించాలని, క్వింటా పత్తికి రూ.475 బోనస్ ప్రకటించాలని ఈ సదస్సులో చర్చించనున్నారు. రాష్ట్ర సదస్సులో వందలాది మంది రైతులు పాల్గొననున్నారు.
News October 12, 2025
నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక అవార్డు

NTR ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరిని ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ఈ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు-2025ను ప్రకటించింది. ప్రజాసేవ, సామాజికంగా ప్రభావితం చేసే అంశాల్లో ఆమె సేవలకుగాను ఈ అవార్డు దక్కింది. లండన్‌లోని గ్లోబల్ కన్వెన్షన్‌లో NOV 4న ఈ అవార్డు అందజేస్తారు. దీనిపై CM చంద్రబాబు ఆమెను అభినందిస్తూ SMలో పోస్టు చేశారు.