News October 12, 2025

మంచిర్యాల జిల్లాలో ప్రగతి పరుగులు..!

image

MNCL జిల్లాగా ఏర్పడి నేటికీ 9 వసంతాలు పూర్తయ్యాయి. మరి ఈ కాలంలో ఎంత అభివృద్ధి జరిగిందనేది పునరాలోచన చేసుకోవాలి. ప్రత్యేక జిల్లా ఏర్పడ్డాక పరిపాలన పరిధి తగ్గి ప్రజలకు త్వరగా సేవలు అందుతున్నాయి. పలు విలీన గ్రామాలను కలిపి MNCL నగరపాలక సంస్థ ఏర్పడటం అభివృద్ధిలో కీలకమైంది. బెల్లంపల్లి, క్యాతనపల్లి, మందమర్రి, RKP అభివృద్ధి చెందుతున్నాయి. రైళ్ల రాకపోకలతో రవాణా మెరుగైంది. ఇంకేం కావాలో కామెంట్ చేయండి.

Similar News

News October 12, 2025

నా కూతురికి రక్షణ లేదు.. రేప్ బాధితురాలి తండ్రి ఆందోళన

image

పశ్చిమ బెంగాల్‌లో తన కూతురి భద్రత గురించి ఆందోళనగా ఉందని <<17979948>>గ్యాంగ్‌రేప్‌<<>> బాధితురాలి తండ్రి వాపోయారు. ‘నా బిడ్డ ప్రస్తుతం నడవలేకపోతోంది. డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మమ్మల్ని ఒడిశాకు వెళ్లనివ్వండి. అక్కడే తను సురక్షితంగా ఉండగలదు’ అని చెప్పారు. కాగా ఫ్రెండ్‌తో కలిసి బయటకు వెళ్లిన మెడికల్ స్టూడెంట్‌పై ముగ్గురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

News October 12, 2025

విశాఖ రానున్న మంత్రి నాదెండ్ల మనోహర్

image

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం సాయంత్రం విశాఖ రానున్నారు. రాత్రి నగరంలోనే బసచేయునున్న మంత్రి సోమవారం వైఎంసీఏలో నిర్వహించనున్న విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం శ్రీకాకుళం బయలుదేరి వెళతారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మళ్లీ సోమవారం రాత్రికి విశాఖ చేరుకుంటారు.

News October 12, 2025

గుంటూరు జిల్లాలో ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్‌లు

image

@ కలెక్టర్ తమీమ్ అన్సారియా: 9849904002.
@ జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ: 9849904003.
@ గుంటూరు IG సర్వ శ్రేష్ట త్రిపాటి: 9440627241.
@ SP వకుల్ జిందాల్: 8688831300.
@ ASP అడ్మిన్: 8688831302.
@ DMHO విజయలక్ష్మీ: 9849902337.
@ DEO రేణుక: 9849909107.
@ DFO: 9949991062.
@ DTC: 9154294107.
@ గుంటూరు RTC RM: 9959225412.
@ Lost Cellphone Whatsapp:8688831574.