News October 12, 2025
యానంలో దారుణ హత్య.. UPDATE

యానంలో శనివారం సాయంత్రం దారుణ హత్య జరిగింది. మూడేళ్ల క్రితం తన తండ్రి (మోకా వెంకటేశ్వరరావు) మృతికి కారణమైన చీటీల వ్యాపారి నారాయణస్వామిని వెంకటేశ్వరరావు తనయుడు ఆనంద్ హత్య చేసినట్లు ఎస్పీ వరదరాజన్ పేర్కొన్నారు. నారాయణస్వామిని ఆనంద్ 10 సార్లు పొడిచినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆనంద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News October 12, 2025
చిదంబరం మాటలు.. కాంగ్రెస్‌లో మంటలు!

కాంగ్రెస్ నేత చిదంబరం చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. 26/11 ముంబై దాడులకు ప్రతీకారంగా పాక్‌పై అటాక్ చేయకుండా అమెరికా ఒత్తిడి చేయడంతో వెనక్కి తగ్గినట్లు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ సైనిక చర్య తప్పుడు మార్గమని తాజాగా చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. దీంతో కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. బీజేపీ, మోదీ లైన్‌లో చిదంబరం మాట్లాడుతున్నారని మండిపడింది.
News October 12, 2025
ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలి: ఎంపీ

పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ కళాశాల క్రీడా మైదానాన్ని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆదివారం పరిశీలించారు. క్రీడాకారులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించే దిశగా మైదానాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా క్రీడల అధికారి శ్రీనివాసరావును ఆదేశించారు. నాయకులు పాల్గొన్నారు.
News October 12, 2025
రెప్పపాటులో బీజేపీ పని పూర్తి చేస్తుంది: ఒవైసీ

BJP బలమైన రాజకీయ ప్రత్యర్థి అని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రోజుకు 24 గంటలూ పని చేస్తుందని చెప్పారు. ప్రతిపక్షాలు అప్రమత్తంగా ఉండాలని, రెప్పపాటులో BJP తన పని పూర్తిచేస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ఓట్ చోరీ ఆరోపణలను తోసిపుచ్చారు. 2009, 2014లోనే తన సెగ్మెంట్‌లో ఓటర్ లిస్టులో డూప్లికెట్ ఎంట్రీలను గుర్తించి, సవాల్ చేశానని చెప్పారు. ఓటర్ లిస్టు, పేర్లను పార్టీలు కచ్చితంగా తనిఖీ చేయాలన్నారు.