News October 12, 2025
సుంకేసుల మూడు గేట్లు ఓపెన్

రాజోలి మండలంలోని సుంకేసుల బ్యారేజీ మూడు గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు వదులుతున్నారు. కర్ణాటక ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల నిలిపివేయడంతో సుంకేసుల బ్యారేజీకి వరద ప్రవాహం తగ్గింది. ఆదివారం బ్యారేజీకి ఇన్ ఫ్లో 15,250 క్యూసెక్కులు వస్తోంది. గేట్ల ద్వారా 11,156 క్యూసెక్కులు, కేసీ కెనాల్ ద్వారా 2,445 క్యూసెక్కులు, మొత్తం 13,601 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
Similar News
News October 12, 2025
నా కూతురికి రక్షణ లేదు.. రేప్ బాధితురాలి తండ్రి ఆందోళన

పశ్చిమ బెంగాల్‌లో తన కూతురి భద్రత గురించి ఆందోళనగా ఉందని <<17979948>>గ్యాంగ్‌రేప్<<>> బాధితురాలి తండ్రి వాపోయారు. ‘నా బిడ్డ ప్రస్తుతం నడవలేకపోతోంది. డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మమ్మల్ని ఒడిశాకు వెళ్లనివ్వండి. అక్కడే తను సురక్షితంగా ఉండగలదు’ అని చెప్పారు. కాగా ఫ్రెండ్‌తో కలిసి బయటకు వెళ్లిన మెడికల్ స్టూడెంట్‌పై ముగ్గురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
News October 12, 2025
విశాఖ రానున్న మంత్రి నాదెండ్ల మనోహర్

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం సాయంత్రం విశాఖ రానున్నారు. రాత్రి నగరంలోనే బసచేయునున్న మంత్రి సోమవారం వైఎంసీఏలో నిర్వహించనున్న విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం శ్రీకాకుళం బయలుదేరి వెళతారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మళ్లీ సోమవారం రాత్రికి విశాఖ చేరుకుంటారు.
News October 12, 2025
గుంటూరు జిల్లాలో ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్‌లు

@ కలెక్టర్ తమీమ్ అన్సారియా: 9849904002.
@ జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ: 9849904003.
@ గుంటూరు IG సర్వ శ్రేష్ట త్రిపాటి: 9440627241.
@ SP వకుల్ జిందాల్: 8688831300.
@ ASP అడ్మిన్: 8688831302.
@ DMHO విజయలక్ష్మీ: 9849902337.
@ DEO రేణుక: 9849909107.
@ DFO: 9949991062.
@ DTC: 9154294107.
@ గుంటూరు RTC RM: 9959225412.
@ Lost Cellphone Whatsapp:8688831574.