News October 12, 2025
ప్రొద్దుటూరు: నకిలీ మద్యం ఇలా గుర్తించండి.!

స్కాన్ చేసి నకిలీ మద్యాన్ని గుర్తించొచ్చని పొద్దుటూరు ఎక్సైజ్ సీఐ సురేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు. APTATS యాప్ ప్లేస్టోర్ నుంచే డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. ఈ యాప్ ద్వారా మద్యం బాటిల్ల మూతపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే తయారీ వివరాలు వస్తాయన్నారు. ఆ మద్యం బాటిల్ ఒరిజినలా? నకిలీనా? అనే సమాచారం తెలుస్తుందన్నారు. ప్రొద్దుటూరులో దుకాణాల్లో నకిలీ మద్యం లేదన్నారు.
Similar News
News October 12, 2025
రెప్పపాటులో బీజేపీ పని పూర్తి చేస్తుంది: ఒవైసీ

BJP బలమైన రాజకీయ ప్రత్యర్థి అని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రోజుకు 24 గంటలూ పని చేస్తుందని చెప్పారు. ప్రతిపక్షాలు అప్రమత్తంగా ఉండాలని, రెప్పపాటులో BJP తన పని పూర్తిచేస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ఓట్ చోరీ ఆరోపణలను తోసిపుచ్చారు. 2009, 2014లోనే తన సెగ్మెంట్‌లో ఓటర్ లిస్టులో డూప్లికెట్ ఎంట్రీలను గుర్తించి, సవాల్ చేశానని చెప్పారు. ఓటర్ లిస్టు, పేర్లను పార్టీలు కచ్చితంగా తనిఖీ చేయాలన్నారు.
News October 12, 2025
నా కూతురికి రక్షణ లేదు.. రేప్ బాధితురాలి తండ్రి ఆందోళన

పశ్చిమ బెంగాల్‌లో తన కూతురి భద్రత గురించి ఆందోళనగా ఉందని <<17979948>>గ్యాంగ్‌రేప్<<>> బాధితురాలి తండ్రి వాపోయారు. ‘నా బిడ్డ ప్రస్తుతం నడవలేకపోతోంది. డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మమ్మల్ని ఒడిశాకు వెళ్లనివ్వండి. అక్కడే తను సురక్షితంగా ఉండగలదు’ అని చెప్పారు. కాగా ఫ్రెండ్‌తో కలిసి బయటకు వెళ్లిన మెడికల్ స్టూడెంట్‌పై ముగ్గురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
News October 12, 2025
విశాఖ రానున్న మంత్రి నాదెండ్ల మనోహర్

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం సాయంత్రం విశాఖ రానున్నారు. రాత్రి నగరంలోనే బసచేయునున్న మంత్రి సోమవారం వైఎంసీఏలో నిర్వహించనున్న విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం శ్రీకాకుళం బయలుదేరి వెళతారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మళ్లీ సోమవారం రాత్రికి విశాఖ చేరుకుంటారు.