News April 7, 2024

HYD: భవనంపై నుంచి కిందపడి చిన్నారి మృతి

image

ప్రమాదవశాత్తు ఓ చిన్నారి భవనంపై నుంచి కిందపడి మృతిచెందిన ఘటన HYD కాచిగూడ PS పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపిన వివరాలు.. కార్పెంటర్ రతన్ తన భార్య నీల, కుమారుడు ఆయూష్, ఏడాదిన్నర కుమార్తె రియాంషితో కలిసి నింబోలిఅడ్డలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. నీల తన కుమారుడికి అన్నం తినిపిస్తుండగా కుమార్తె రియాంషి ఆడుకుంటూ బాల్కానీలో వేసిన కుర్చీ ఎక్కి కింద పడి మృతిచెందింది. 

Similar News

News September 10, 2025

BREAKING: కూకట్‌పల్లిలో మహిళ హత్య

image

HYD కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక స్వాన్ లేక్ అపార్ట్‌మెంట్‌లో రేణు అగర్వాల్ (50) అనే మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కూకట్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 10, 2025

పాక్ జాతీయుడిని స్వదేశానికి పంపిన హైదరాబాద్ పోలీసులు

image

చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించిన ఓ పాకిస్థాన్ జాతీయుడిని హైదరాబాద్ పోలీసులు స్వదేశానికి పంపించారు. మహ్మద్ ఉస్మాన్(48) అనే వ్యక్తి నేపాల్ మీదుగా 2011లో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. హైదరాబాద్‌లో నాలుగు క్రిమినల్ కేసుల్లో ఇతడు నిందితుడు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఇతడిని సెప్టెంబర్ 9న అటారీ సరిహద్దు వద్ద పాకిస్థాన్ రేంజర్స్‌కు అప్పగించారు.

News September 10, 2025

HYD: ‘తొలి భూ పోరాటానికి నాంది పలికిన చాకలి ఐలమ్మ’

image

తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత చాకలి ఐలమ్మ అని HYD జిల్లా అదనపు కలెక్టర్ కదిరవన్ పళని అన్నారు. బుధవారం చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని నాంపల్లిలోని కలెక్టరేట్‌లో BC సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ పళని, DRO వెంకటచారితో కలిసి కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.