News October 12, 2025
ADB: కూలెక్కిన రాజకీయం..!

స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడటంతో అభ్యర్థుల్లో నిరాశ అలుముకుంది. నాలుగైదు రోజుల వరకు భారీగా ఖర్చుపెట్టిన నేతలు ఇప్పుడు చల్లబడ్డారు. ఎన్నికలు అసలు ఇప్పట్లో జరుగుతాయని ప్రశ్న అందరిలో మొదలైంది. ఉట్నూరు, నార్నూర్ తదితర మండలాల్లో నాయకులు కనీసం చాయ్ కూడా తాపడం లేదని చర్చ నడుస్తోంది. ఇంకొన్ని చోట్ల అరే ఇప్పుడు కాదు మల్ల పెద్దగానే దావత్ చేసుకుందాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
Similar News
News October 12, 2025
కమలాపురం: ఈతకు వెళ్లి బాలిక మృతి

కమలాపురంలో ఈతకు వెళ్లి బాలిక మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు వివరాల మేరకు.. ఈర్ల సుకన్య (11) అనే బాలిక ఆదివారం కావడంతో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి గల్లంతైంది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు మృతదేహాన్ని బయటకి తీశారు. ఇసుక తవ్వడంతో లోతైన గుంతలు ఏర్పడడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పేర్కొన్నారు.
News October 12, 2025
IMA కరీంనగర్ అధ్యక్షురాలిగా డా.ఆకుల శైలజ

2025–26 సంవత్సరానికి భారత వైద్యుల సంఘం(IMA) కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలిగా డా.ఆకుల శైలజను ఎన్నుకున్నట్లు IMA ప్రకటించింది. ఎన్నికైన డా.ఆకుల శైలజను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. కరీంనగర్ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో, వైద్య సేవల అభివృద్ధిలో ఆమె చేస్తున్న కృషిని ప్రసంశించారు.
News October 12, 2025
నిర్మల్: ఈ నెల 14 జిల్లా బ్యాట్మెంటన్ జట్ల ఎంపిక

U- 14, 17 జిల్లాస్థాయి బ్యాట్మెంటన్ బాలబాలికల జట్లు ఎంపిక చేయనున్నట్లు జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న తెలిపారు. ఈ నెల 14న జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హత, ఇతర ధ్రువీకరణ పత్రాలతో నిర్ణీత సమయంలో హాజరుకావాలని సూచించారు.