News October 12, 2025
మోదీకి ట్రంప్ ఆహ్వానం

రేపు ఈజిప్టులో జరగనున్న గాజా శాంతి ఒప్పందానికి ట్రంప్ మోదీని ఆహ్వానించారు. అటు ఈజిప్టు అధ్యక్షుడు కూడా ఆయనను ఆహ్వానించారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదలపై ఈ ఒప్పందంలో చర్చించనున్నట్లు సమాచారం. కాగా మోదీ హాజరుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Similar News
News October 12, 2025
ఉచితాలు కాదు.. భవిష్యత్ కావాలన్నారు: పవన్

AP: తిత్లీ తుఫాను సమయంలో శ్రీకాకుళం యువతను పరామర్శించానని, వాళ్లతో జరిగిన సంభాషణ గుర్తుందని Dy.CM పవన్ పేర్కొన్నారు. ‘వారు ఉచితాలు, సంక్షేమ పథకాలు అడగలేదు. 25 ఏళ్ల మంచి భవిష్యత్ కావాలన్నారు. నిత్యం యువతతో మాట్లాడుతూ ఉంటా. వారి కలలు నిజం చేసేందుకు కృషి చేస్తా’ అని పేర్కొన్నారు. 2018లో పవన్‌తో తన జర్నీ మొదలైందని మంత్రి మనోహర్ ఓ ఫోటోను ట్వీట్ చేయగా దానికి పవన్ పైవిధంగా స్పందించారు.
News October 12, 2025
చిదంబరం మాటలు.. కాంగ్రెస్‌లో మంటలు!

కాంగ్రెస్ నేత చిదంబరం చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. 26/11 ముంబై దాడులకు ప్రతీకారంగా పాక్‌పై అటాక్ చేయకుండా అమెరికా ఒత్తిడి చేయడంతో వెనక్కి తగ్గినట్లు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ సైనిక చర్య తప్పుడు మార్గమని తాజాగా చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. దీంతో కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. బీజేపీ, మోదీ లైన్‌లో చిదంబరం మాట్లాడుతున్నారని మండిపడింది.
News October 12, 2025
రెప్పపాటులో బీజేపీ పని పూర్తి చేస్తుంది: ఒవైసీ

BJP బలమైన రాజకీయ ప్రత్యర్థి అని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రోజుకు 24 గంటలూ పని చేస్తుందని చెప్పారు. ప్రతిపక్షాలు అప్రమత్తంగా ఉండాలని, రెప్పపాటులో BJP తన పని పూర్తిచేస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ఓట్ చోరీ ఆరోపణలను తోసిపుచ్చారు. 2009, 2014లోనే తన సెగ్మెంట్‌లో ఓటర్ లిస్టులో డూప్లికెట్ ఎంట్రీలను గుర్తించి, సవాల్ చేశానని చెప్పారు. ఓటర్ లిస్టు, పేర్లను పార్టీలు కచ్చితంగా తనిఖీ చేయాలన్నారు.