News October 12, 2025

ములుగు: ప్రైవేటు ఆసుపత్రి.. అందినకాడికి గుంజుడే!

image

జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల తీరుతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తే అవసరం లేని టెస్టులు చేసి జేబులు ఖాళీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అడ్మిట్, పరీక్షల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. వ్యాధి పేరు చెప్పి రోగులను భయభ్రాంతులకు గురి చేస్తుండడం గమనార్హం.

Similar News

News October 12, 2025

ఉచితాలు కాదు.. భవిష్యత్ కావాలన్నారు: పవన్

image

AP: తిత్లీ తుఫాను సమయంలో శ్రీకాకుళం యువతను పరామర్శించానని, వాళ్లతో జరిగిన సంభాషణ గుర్తుందని Dy.CM పవన్ పేర్కొన్నారు. ‘వారు ఉచితాలు, సంక్షేమ పథకాలు అడగలేదు. 25 ఏళ్ల మంచి భవిష్యత్ కావాలన్నారు. నిత్యం యువతతో మాట్లాడుతూ ఉంటా. వారి కలలు నిజం చేసేందుకు కృషి చేస్తా’ అని పేర్కొన్నారు. 2018లో పవన్‌తో తన జర్నీ మొదలైందని మంత్రి మనోహర్ ఓ ఫోటోను ట్వీట్ చేయగా దానికి పవన్ పైవిధంగా స్పందించారు.

News October 12, 2025

కమలాపురం: ఈతకు వెళ్లి బాలిక మృతి

image

కమలాపురంలో ఈతకు వెళ్లి బాలిక మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు వివరాల మేరకు.. ఈర్ల సుకన్య (11) అనే బాలిక ఆదివారం కావడంతో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి గల్లంతైంది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు మృతదేహాన్ని బయటకి తీశారు. ఇసుక తవ్వడంతో లోతైన గుంతలు ఏర్పడడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పేర్కొన్నారు.

News October 12, 2025

IMA కరీంనగర్ అధ్యక్షురాలిగా డా.ఆకుల శైలజ

image

2025–26 సంవత్సరానికి భారత వైద్యుల సంఘం(IMA) కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలిగా డా.ఆకుల శైలజను ఎన్నుకున్నట్లు IMA ప్రకటించింది. ఎన్నికైన డా.ఆకుల శైలజను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. కరీంనగర్ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో, వైద్య సేవల అభివృద్ధిలో ఆమె చేస్తున్న కృషిని ప్రసంశించారు.