News October 12, 2025
వికారాబాద్: డీసీసీ రేస్‌లో సుధాకర్ రెడ్డి..?

జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లకు నూతన అధ్యక్షులను నియమించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించిన నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పదవి రేస్‌లో వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధ సుధాకర్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. దాదాపు పది సంవత్సరాలపాటు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సుధాకర్ రెడ్డి 2023 సాధారణ ఎన్నికల్లో గడ్డం ప్రసాద్ కుమార్ విజయం సాధించడంలో ముఖ్యపాత్ర పోషించారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News October 12, 2025
ఊట్కూర్: చిన్నారులపై వీధి కుక్కల దాడి

ఊట్కూరు శ్రీనివాస కాలనీలో ఆదివారం వీధి కుక్కల దాడిలో చిన్నారులు గాయపడ్డారు. ఇంటి బయట ఆడుకుంటున్న విశ్వ అధ్విత్, రవి, రాకేష్ తో పాటు పలువురు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచినట్లు వారి తల్లిదండ్రులు వాపోయారు. గ్రామంలో కుక్కలు స్వైర విహారం చేస్తూ.. మనుషులు, పశువుల పై దాడులకు పాల్పడుతున్న సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
News October 12, 2025
ప్రధాని పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా జరగాలి: CM

ప్రధాని నరేంద్ర మోదీ జిల్లా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ఎటువంటి లోపం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని CM చంద్రబాబు నాయుడు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆదివారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. కర్నూలు నుంచి స్పెషల్ ఆఫీసర్ వీర పాండేన్, జిల్లా కలెక్టర్ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు.
News October 12, 2025
HNK, WGL జిల్లాల్లో AICC అబ్జర్వర్ల పర్యటన షెడ్యూల్ ఇదే!

HNK, WGL జిల్లాల డీసీసీ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ నేపథ్యంలో ఏఐసీసీ, PCC అబ్జర్వర్లు రేపటి నుంచి జిల్లాలోని పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈనెల 13న వరంగల్ పశ్చిమ నియోజకవర్గం, 14న పరకాల, 16న వరంగల్ తూర్పు, 17న వర్ధన్నపేట, 18న నర్సంపేట నియోజకవర్గాల పార్టీ శ్రేణులతో అబ్జర్వర్లు సమావేశం నిర్వహించనున్నారు. హనుమకొండ డీసీసీ అధ్యక్షుడి పీఠం ఎవరిని వరిస్తుందో చూడాల్సి ఉంది.!