News October 12, 2025
‘స్థానిక’ ఎన్నికలు: రేపు సుప్రీంకోర్టుకు సర్కార్

TG: ‘స్థానిక’ ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని తెచ్చిన జీవో నం.9పై హైకోర్టు <<17958620>>స్టే<<>> విధించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. రేపు కోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తరఫున ఢిల్లీకి మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిని పంపే ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు సమాచారం. అటు PCC చీఫ్ మహేశ్ ఢిల్లీకి వెళ్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Similar News
News October 12, 2025
తురకపాలెం బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన పెమ్మసాని

గుంటూరు(D) తురకపాలెంలో మెలియాయిడోసిస్ వ్యాధితోనే మరణాలు సంభవించాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెలియకుండానే వ్యాధి వ్యాప్తి జరిగిందని చెప్పారు. మరణించిన 28 మంది కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేశారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఈ ప్రాంతంలో బ్లడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షించేందుకు వైద్య నిపుణులను తీసుకొచ్చామన్నారు.
News October 12, 2025
రాబోయే 2-3 గంటల్లో భారీ వర్షం

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. APలో శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అటు TGలో భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడతాయని పేర్కొంటూ HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News October 12, 2025
3వ రోజు ముగిసిన ఆట.. పోరాడుతున్న వెస్టిండీస్

INDvsWI రెండో టెస్టులో తొలి 2 రోజులు టీమ్‌ఇండియా డామినెన్స్ కనిపించింది. కాగా మూడో రోజు ఫాలో ఆన్ ఆడుతున్న వెస్టిండీస్ పోరాడుతోంది. 35కే 2 వికెట్లు పడిపోయినా బ్యాటర్లు హోప్(66), క్యాంప్‌బెల్(87) క్రీజులో పాతుకుపోయారు. మరో వికెట్ పడకుండా 138 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆ జట్టు ఇంకా 97 పరుగుల వెనుకంజలో ఉంది. సిరాజ్, సుందర్ చెరో వికెట్ తీశారు.