News October 12, 2025

ఖమ్మం: రోడ్డు ప్రమాదంలో ఫొటోగ్రాఫర్ మృతి

image

తల్లాడ మండలంలోని పినపాక గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువ ఫొటోగ్రాఫర్‌ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. వైరా వైపు బైక్‌పై వెళ్తున్న కొణిజర్లకు చెందిన ఫొటోగ్రాఫర్‌ పవన్ (22)ను గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో పవన్ అక్కడికక్కడే మరణించగా, మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని పోలీసులు 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 12, 2025

తురకపాలెం బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన పెమ్మసాని

image

గుంటూరు(D) తురకపాలెంలో మెలియాయిడోసిస్ వ్యాధితోనే మరణాలు సంభవించాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెలియకుండానే వ్యాధి వ్యాప్తి జరిగిందని చెప్పారు. మరణించిన 28 మంది కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేశారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఈ ప్రాంతంలో బ్లడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షించేందుకు వైద్య నిపుణులను తీసుకొచ్చామన్నారు.

News October 12, 2025

కరీంనగర్: యథావిధిగా ప్రజావాణి

image

ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా సోమవారం నుంచి కొనసాగించనున్నట్లు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రజలు ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో ప్రజావాణి కార్యక్రమం యాథావిధిగా కొనసాగుతుందన్నారు.

News October 12, 2025

రేపు యథావిధిగా PGRS: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)ను సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జి. లక్ష్మీశ ఆదివారం ప్రకటించారు. విజయవాడ కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి ప్రజల వద్ద ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు చెప్పారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల స్థాయిల్లో అధికారులు అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.