News October 12, 2025

KNR: మోసం చేశాడంటూ యువతి సూసైడ్ అటెంప్ట్

image

ప్రేమించి మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ముందే ఓ యువతి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హుజూరాబాద్‌‌కు చెందిన వినోద్‌తో జగిత్యాలకు చెందిన యువతి కొంతకాలంగా ప్రేమలో ఉంది. ఈ క్రమంలో తనకు వేరే యువతితో తనకు పెళ్లి నిశ్చయమైందని, ఇకపై తమ సంబంధానికి స్వస్తి పలుకుదామని ప్రియుడు చెప్పడంతో ఆవేదన చెందిన బాధిత యువతి ఆదివారం అతడి ఇంటికి వెళ్లి సూసైడ్ అటెంప్ట్ చేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 12, 2025

ఇతిహాసాలు క్విజ్ – 33 సమాధానాలు

image

1. రామాయణాన్ని విభజించే ముఖ్య భాగాలను ‘కాండము’ అని పిలుస్తారు.
2. సంస్కృత మహాభారతంలో 100 ఉప పర్వాలు ఉన్నాయి.
3. వేద వ్యాసుడి తండ్రి పరాశరుడు.
4. నేపాల్‌లో జరిపే తిహార్ పండుగలో శునకాన్ని సత్కరిస్తారు.
5. ‘క్షీరం’ అనే సంస్కృత పదానికి తెలుగు అర్థం ‘పాలు’.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 12, 2025

పిఠాపురం జనసేన ఇన్‌ఛార్జ్‌గా దొరబాబు..?

image

పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ పదవిలో మార్పులు జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబును ఇన్‌ఛార్జ్‌గా నియమించనున్నట్లు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఇన్‌ఛార్జ్‌పై క్యాడర్ అసంతృప్తిగా ఉండటంతో, అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని జనసేన వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దొరబాబు గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సంగతి తెలిసిందే.

News October 12, 2025

నిర్మల్: మద్యం షాపుల రిజర్వేషన్లు ఖరారు

image

జిల్లాలో వైన్స్ షాపులకు అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు. 47 మద్యం దుకాణాల్లో ఎస్టీ 1, గౌడ 3, ఎస్సీ 5 వైన్ షాపులు కేటాయించారు. ఎస్టీ -నర్సాపూర్ (జి)షాపు నెం.2, గౌడలకు – నిర్మల్ షాపు నెం.1, పెంబి, కుబీర్ షాపు నెం.1, ఎస్సీలకు – తానూర్, సొన్ షాపు నెం.2, సారంగాపూర్ షాపు నెం.1, కడెం షాపు నెం.1, భైంసా షాపు నెం.5 కేటాయించారు. ఆసక్తి గలవారు ఈ నెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.