News October 12, 2025
హిందువులపై దాడి అంటూ ఇండియా ఫేక్ న్యూస్: యూనస్

తమ దేశంలో హిందువులపై హింస జరుగుతోందన్న ఆరోపణలను బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ యూనస్ ఖండించారు. అవన్నీ ఇండియా సృష్టించిన ఫేక్ వార్తలని మండిపడ్డారు. ‘ప్రస్తుతం ఇండియా స్పెషాలిటీస్‌లో ఫేక్ న్యూస్ ఒకటి. సరిహద్దులు, ఇతర స్థానిక సమస్యల విషయంలో ఇరుగు పొరుగు మధ్య విభేదాలు సాధారణమే. వాటికి మతం రంగు పులమకూడదు’ అని చెప్పారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలిపారు.
Similar News
News October 12, 2025
ఇతిహాసాలు క్విజ్ – 33 సమాధానాలు

1. రామాయణాన్ని విభజించే ముఖ్య భాగాలను ‘కాండము’ అని పిలుస్తారు.
2. సంస్కృత మహాభారతంలో 100 ఉప పర్వాలు ఉన్నాయి.
3. వేద వ్యాసుడి తండ్రి పరాశరుడు.
4. నేపాల్‌లో జరిపే తిహార్ పండుగలో శునకాన్ని సత్కరిస్తారు.
5. ‘క్షీరం’ అనే సంస్కృత పదానికి తెలుగు అర్థం ‘పాలు’.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 12, 2025
మెనోపాజ్ తర్వాత గుండె సమస్యలు

మహిళల్లో మెనోపాజ్ తర్వాత అనారోగ్యాలు చుట్టుముడతాయి. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్ తగ్గి టెస్టోస్టెరాన్ పెరగడంతో గుండెసంబంధిత సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. గుండె ఆరోగ్యం కోసం రెగ్యులర్ హార్ట్ చెకప్స్, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. కొలెస్ట్రాల్, బీపీ, బ్లడ్‌లో గ్లూకోజ్‌లెవల్స్ చెక్ చేసుకోవాలి. ఫైబర్, నట్స్, పండ్లు, కూరగాయలు, చేపలు ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
News October 12, 2025
ఫుట్‌వేర్ కొంటున్నారా? ఈ టిప్స్ పాటించండి

పాదాల సంరక్షణకు ఫుట్‌వేర్ అవసరం. వీటిని కొనేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు. మీ పాదాల సైజ్‌కు సరిపోయేవే కొనాలి. టైట్/ లూజ్‌గా ఉన్నా నడవడానికి ఇబ్బందవుతుంది. స్టైల్‌తో పాటు మనం పెట్టే డబ్బుకి తగ్గ క్వాలిటీ ఉందో..లేదో చూడాలి. రెగ్యులర్ వేర్, ఫంక్షనల్ వేర్, ఆఫీస్ వేర్ ఇలా ఉంటాయి. మీ అవసరాన్ని బట్టి ఫుట్‌వేర్ ఎంచుకోవాలి. వైట్, బ్లాక్, క్రీమ్ కలర్స్ ఏ డ్రెస్‌కైనా మ్యాచ్ అవుతాయి.