News October 12, 2025

వంటింటి చిట్కాలు

image

☛ బెండకాయ కూర చేసే ముందు ముక్కల మీద నిమ్మరసం చల్లితే జిగురు ఉండదు.
☛ నాన్‌వెజ్ వండిన పాత్రల్లో నీచు వాసన పోవాలంటే వాటిలో కొద్దిగా ఉప్పు వేసి కాసేపటి తర్వాత కడిగితే సరిపోతుంది.
☛ పాస్తా ఉడికించినప్పుడు ముద్దలా అవ్వకుండా ఉండాలంటే వాటిని ఉడికించే గిన్నెలో ఓ చెక్క స్పూన్ వెయ్యాలి.
☛ సాంబార్‌లో ఉప్పు ఎక్కువైతే ఉడికించిన బంగాళదుంప ముక్కలు/ కాస్త శెనగపిండిని కలిపితే ఉప్పు తగ్గుతుంది. <<-se>>#VantintiChitkalu<<>>

Similar News

News October 12, 2025

ఇతిహాసాలు క్విజ్ – 33 సమాధానాలు

image

1. రామాయణాన్ని విభజించే ముఖ్య భాగాలను ‘కాండము’ అని పిలుస్తారు.
2. సంస్కృత మహాభారతంలో 100 ఉప పర్వాలు ఉన్నాయి.
3. వేద వ్యాసుడి తండ్రి పరాశరుడు.
4. నేపాల్‌లో జరిపే తిహార్ పండుగలో శునకాన్ని సత్కరిస్తారు.
5. ‘క్షీరం’ అనే సంస్కృత పదానికి తెలుగు అర్థం ‘పాలు’.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 12, 2025

మెనోపాజ్ తర్వాత గుండె సమస్యలు

image

మహిళల్లో మెనోపాజ్ తర్వాత అనారోగ్యాలు చుట్టుముడతాయి. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్ తగ్గి టెస్టోస్టెరాన్ పెరగడంతో గుండెసంబంధిత సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. గుండె ఆరోగ్యం కోసం రెగ్యులర్ హార్ట్ చెకప్స్, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. కొలెస్ట్రాల్, బీపీ, బ్లడ్‌లో గ్లూకోజ్‌‌లెవల్స్ చెక్ చేసుకోవాలి. ఫైబర్, నట్స్, పండ్లు, కూరగాయలు, చేపలు ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

News October 12, 2025

ఫుట్‌వేర్ కొంటున్నారా? ఈ టిప్స్ పాటించండి

image

పాదాల సంరక్షణకు ఫుట్‌వేర్ అవసరం. వీటిని కొనేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు. మీ పాదాల సైజ్‌కు సరిపోయేవే కొనాలి. టైట్/ లూజ్‌గా ఉన్నా నడవడానికి ఇబ్బందవుతుంది. స్టైల్‌తో పాటు మనం పెట్టే డబ్బుకి తగ్గ క్వాలిటీ ఉందో..లేదో చూడాలి. రెగ్యులర్ వేర్, ఫంక్షనల్ వేర్, ఆఫీస్ వేర్ ఇలా ఉంటాయి. మీ అవసరాన్ని బట్టి ఫుట్‌వేర్ ఎంచుకోవాలి. వైట్, బ్లాక్, క్రీమ్ కలర్స్ ఏ డ్రెస్‌కైనా మ్యాచ్ అవుతాయి.