News October 12, 2025
విశాఖ ఉక్కుకు ప్రభుత్వం అండ.. ₹2,400 కోట్లు..

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రాష్ట్ర సర్కారు అండగా నిలిచింది. విద్యుత్ ఛార్జీల విషయంలో ఉపశమనం కల్పించింది. EPDCLకు ప్లాంట్ చెల్లించాల్సిన ₹754 కోట్ల బకాయిలు, వచ్చే రెండేళ్ల ఛార్జీలతో కలిపి రూ.2,400 కోట్లను RINLలో ఈక్విటీ కింద పెట్టుబడిగా పెట్టే ప్రతిపాదనను ఆమోదించింది. ఈ మొత్తాన్ని నాన్ క్యుములేటివ్ రిడీమబుల్ ప్రిఫరెన్షియల్ వాటా మూలధనంగా EPDCLకు బదలాయించేందుకు ఓకే చెప్పింది.
Similar News
News October 12, 2025
బిహార్‌లో NDA సీట్ల షేరింగ్.. ఏ పార్టీకి ఎన్నంటే?

బిహార్‌లో NDA సీట్ల షేరింగ్‌ను ఆ రాష్ట్ర బీజేపీ ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. మొత్తం 243 సీట్లలో బీజేపీకి 101, JDU 101, LJP (R) 29, రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM)కి 6, హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM)కు 6 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ NDA ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలో రెండు విడతల్లో(నవంబర్ 6, 11 తేదీల్లో) ఎన్నికలు జరగనున్నాయి.
News October 12, 2025
బంగారు పల్లకీలో ఊరేగించి.. కలెక్టరుకు వీడ్కోలు

తమ సేవలతో ప్రజల గుండెల్లో స్థానం పొందే అధికారులను చాలాఅరుదుగా చూస్తుంటాం. వారిలో ఒకరే మధ్యప్రదేశ్ సియోని జిల్లా కలెక్టర్ సంస్కృతి జైన్. ఆమె బదిలీ సందర్భంగా బంగారు పల్లకీలో కూర్చోబెట్టి మరీ వీడ్కోలు పలికారు సిబ్బంది. గిఫ్ట్ ఎ డెస్క్ ప్రోగ్రాం, అనేక ప్రజోపయోగ కార్యక్రమాలతో ఈ కలెక్టర్ ప్రజలకు చేరువై ప్రశంసలు దక్కించుకున్నారు. ఉద్యోగంలో ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలిచారు.
News October 12, 2025
WWC: భారత్ ఆలౌట్.. స్కోర్ ఎంతంటే?

మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో 48.5 ఓవర్లలో భారత్ 330 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు ప్రతిక (75), స్మృతి మంధాన (80) అదిరిపోయే భాగస్వామ్యం ఇవ్వడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. తర్వాత వచ్చిన హర్లీన్ డియోల్, జెమీమా, రిచా ఘోష్ ఫర్వాలేదనిపించారు. చివర్లో 36 పరుగుల వ్యవధిలో భారత్ 6 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ బౌలర్లలో అన్నాబెల్ 5, సోఫీ 3 వికెట్లతో రాణించారు.