News October 12, 2025
ఐటీఐ, డిగ్రీ అర్హతతో 87పోస్టులు

SJVN లిమిటెడ్‌లో 87 పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ. వీటిలో అసిస్టెంట్(అకౌంట్స్), డ్రైవర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, స్టోర్ కీపర్, సర్వేయర్ పోస్టులు ఉన్నాయి. జాబ్‌ను బట్టి ఐటీఐ, డిగ్రీ, 8వ తరగతి (డ్రైవర్ పోస్టులకు)ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 30ఏళ్లు. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sjvn.nic.in/
Similar News
News October 12, 2025
బిహార్‌లో NDA సీట్ల షేరింగ్.. ఏ పార్టీకి ఎన్నంటే?

బిహార్‌లో NDA సీట్ల షేరింగ్‌ను ఆ రాష్ట్ర బీజేపీ ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. మొత్తం 243 సీట్లలో బీజేపీకి 101, JDU 101, LJP (R) 29, రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM)కి 6, హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM)కు 6 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ NDA ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలో రెండు విడతల్లో(నవంబర్ 6, 11 తేదీల్లో) ఎన్నికలు జరగనున్నాయి.
News October 12, 2025
బంగారు పల్లకీలో ఊరేగించి.. కలెక్టరుకు వీడ్కోలు

తమ సేవలతో ప్రజల గుండెల్లో స్థానం పొందే అధికారులను చాలాఅరుదుగా చూస్తుంటాం. వారిలో ఒకరే మధ్యప్రదేశ్ సియోని జిల్లా కలెక్టర్ సంస్కృతి జైన్. ఆమె బదిలీ సందర్భంగా బంగారు పల్లకీలో కూర్చోబెట్టి మరీ వీడ్కోలు పలికారు సిబ్బంది. గిఫ్ట్ ఎ డెస్క్ ప్రోగ్రాం, అనేక ప్రజోపయోగ కార్యక్రమాలతో ఈ కలెక్టర్ ప్రజలకు చేరువై ప్రశంసలు దక్కించుకున్నారు. ఉద్యోగంలో ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలిచారు.
News October 12, 2025
WWC: భారత్ ఆలౌట్.. స్కోర్ ఎంతంటే?

మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో 48.5 ఓవర్లలో భారత్ 330 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు ప్రతిక (75), స్మృతి మంధాన (80) అదిరిపోయే భాగస్వామ్యం ఇవ్వడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. తర్వాత వచ్చిన హర్లీన్ డియోల్, జెమీమా, రిచా ఘోష్ ఫర్వాలేదనిపించారు. చివర్లో 36 పరుగుల వ్యవధిలో భారత్ 6 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ బౌలర్లలో అన్నాబెల్ 5, సోఫీ 3 వికెట్లతో రాణించారు.