News October 12, 2025
జూబ్లీహిల్స్ అడ్డా.. ఎవరిది బిడ్డా..?

HYD జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అటు BRS, ఇటు కాంగ్రెస్ జోరు పెంచాయి. నువ్వానేనా అన్నట్లు రేసులో పరుగెత్తుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని డివిజన్లు, ఏరియాలకు MLAలు, MLCలు, మాజీ MLAలను ఇన్‌ఛార్జులుగా BRS నియమించడంతో వారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి మంత్రులు, స్టేట్ లీడర్లు రంగంలోకి దిగి డివిజన్ల వారీగా పర్యటిస్తున్నారు. జూబ్లీహిల్స్ థగ్ ఆఫ్ వార్‌లో గెలిచేదెవరో?
Similar News
News October 12, 2025
మేడారానికి పొంగులేటి.. నెలకొన్న ఆసక్తి!

మేడారం ఆలయ ప్రాంగణం ఆధునీకరణ పనులను వంద రోజుల్లో పూర్తి చేయాలని CM రేవంత్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతర పనులపై సమీక్ష జరిపేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం మేడారం రానున్నారు. అయితే, తాజాగా మంత్రి కొండా సురేఖ తన శాఖలో పొంగులేటి పెత్తనం చేస్తున్నారంటూ అధిష్ఠానంకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పొంగులేటి రాకపై ఆసక్తి నెలకొంది. కాగా, 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది.
News October 12, 2025
యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని ఆమె వెల్లడించారు. ప్రజలు 1100కు కాల్ చేసి కూడా సమస్యలు తెలియజేయవచ్చని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
News October 12, 2025
‘రంజీ’ తెచ్చిన హైదరాబాదీ!

సిటీలోనే పుట్టి, పెరిగారు ఆయన. క్రికెట్ అంటే ఆసక్తి. పుట్టిన గడ్డ పేరు నిలబెట్టాలని గట్టి నిర్ణయం తీసుకున్నారేమో మరి. దేశవాలీ క్రికెట్‌లో మన హైదరాబాద్ పేరును మారుమోగించారు. ఆయనే నవాబ్ సయ్యద్ మొహమ్మద్ హుస్సేన్. నిజాం కాలేజీలో చదివిన ఆయన క్రికెట్‌లో రాణించారు. ఆయన ప్రతిభతో రంజీ ట్రోఫీ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు సారథి అయ్యారు. ఈయన కెప్టెన్సీలోనే (1937-38) రంజీ 3వ టైటిల్‌ను HYD గెలిచింది.