News October 12, 2025

HYD: తల్లితండ్రుల్లారా? వేధింపులకు గురైతే కాల్ చేయండి

image

తల్లిదండ్రులపై వేధింపులు పెరుగుతున్నాయి. HYDలో 2025లో సెప్టెంబర్ నెలనాటికి తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేసిన కేసులు నమోదయ్యాయి. HYDలో అనేక వృద్ధాశ్రమాలు ఉన్నాయి. 15 ఉచిత సేవలు అందిస్తున్నాయి. వృద్ధులు ఇబ్బందులు పడితే ఫిర్యాదు చేయొచ్చని అధికారులు తెలిపారు. HYD 74166 87878, RR 95156 78010, MDCL 94924 09781 కాల్ చేయండి.

Similar News

News October 12, 2025

BREAKING: చీరాల బీచ్‌లో ఐదుగురు గల్లంతు

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల మండలంలో ఆదివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. వాడరేవు సముద్ర తీరంలో అలల తాకిడికి ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఐదుగురిలో ముగ్గురి మృతదేహాలను గుర్తించారు. మరో ఇద్దరికోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 12, 2025

మంత్రి పొంగులేటి మేడారం పర్యటన వివరాలివే!

image

మేడారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం పర్యటించనున్న విషయం తెలిసిందే. ఉ. 9:30కి బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి 10:30కి మేడారం చేరుకుంటారు. 10:45కు సమ్మక్క, సారలమ్మను దర్శించుకోనున్నాను. 11 గం.కు అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. 11:30కు జాతర అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఒంటి గంటకు బయల్దేరి మ. 2 గం.కు హైదరాబాద్ చేరుకుంటారు.

News October 12, 2025

తణుకు: ఆడుకుందామని వెళ్లి.. కాలువలో పడి గల్లంతు

image

తణుకు మండలం పైడిమర్రు కాలువలో ఓ బాలుడు గల్లంతైన విషయం తెలిసిందే. తణుకుకి చెందిన 8వ తరగతి చదువుతున్న బొమ్మనబోయిన జోగేంద్రగా గుర్తించారు. ఆదివారం కావడంతో జోగేంద్ర తన స్నేహితులతో కలిసి ఆడుకుందామని వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతయ్యాడు. స్థానికులు గాలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదు చేశారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.