News October 12, 2025
PDPL: భర్తకు తెలీకుండా ‘చిరంజీవి’తో మాట్లాడేది..!

PDPL(D) సెంటినరీ కాలనీలో <<17967599>>మీసేవ నిర్వహకుడు చిరంజీవి<<>> శుక్రవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. కాగా, మృతుడితో కమాన్‌పూర్(M) పెంచికల్పేటకు చెందిన సంధ్యారాణి భర్తకు తెలీకుండా చాటింగ్ చేస్తూ ఫోన్లో మాట్లాడేది. ఈమె ఓ పనిపై మీసేవకు రాగా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో కొద్దిరోజులుగా సంధ్యారాణి చిరంజీవితో మాట్లాడట్లేదు. ఆగ్రహించిన అతడు వేధిస్తుండటంతో సంధ్యారాణి భర్త, అన్న, తండ్రితో మర్డర్ చేయించింది.
Similar News
News October 12, 2025
BREAKING: చీరాల బీచ్‌లో ఐదుగురు గల్లంతు

ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల మండలంలో ఆదివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. వాడరేవు సముద్ర తీరంలో అలల తాకిడికి ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఐదుగురిలో ముగ్గురి మృతదేహాలను గుర్తించారు. మరో ఇద్దరికోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 12, 2025
మంత్రి పొంగులేటి మేడారం పర్యటన వివరాలివే!

మేడారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం పర్యటించనున్న విషయం తెలిసిందే. ఉ. 9:30కి బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి 10:30కి మేడారం చేరుకుంటారు. 10:45కు సమ్మక్క, సారలమ్మను దర్శించుకోనున్నాను. 11 గం.కు అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. 11:30కు జాతర అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఒంటి గంటకు బయల్దేరి మ. 2 గం.కు హైదరాబాద్ చేరుకుంటారు.
News October 12, 2025
తణుకు: ఆడుకుందామని వెళ్లి.. కాలువలో పడి గల్లంతు

తణుకు మండలం పైడిమర్రు కాలువలో ఓ బాలుడు గల్లంతైన విషయం తెలిసిందే. తణుకుకి చెందిన 8వ తరగతి చదువుతున్న బొమ్మనబోయిన జోగేంద్రగా గుర్తించారు. ఆదివారం కావడంతో జోగేంద్ర తన స్నేహితులతో కలిసి ఆడుకుందామని వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతయ్యాడు. స్థానికులు గాలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదు చేశారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.