News October 12, 2025

MDK: ఎన్నికల జోరు మాయం.. చాయ్ వాసన మసకబారింది!

image

స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడటంతో అభ్యర్థుల్లో నిరాశ అలుముకుంది. నాలుగైదు రోజులుగా ప్రచారానికి భారీగా ఖర్చు చేసిన నేతలు ఇప్పుడు చల్లబడ్డారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొన్ని మండలాల్లో నేతలు ఇప్పుడు చాయ్‌ చర్చలకైనా కనిపించడం లేదు. ఇంకొందరు “ఇప్పుడేం తొందర లేదు, మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైతే దావత్ చేసుకుందాం” అంటూ సరదాగా మాట్లాడుకుంటున్నారు.

Similar News

News October 12, 2025

తణుకు: ఆడుకుందామని వెళ్లి.. కాలువలో పడి గల్లంతు

image

తణుకు మండలం పైడిమర్రు కాలువలో ఓ బాలుడు గల్లంతైన విషయం తెలిసిందే. తణుకుకి చెందిన 8వ తరగతి చదువుతున్న బొమ్మనబోయిన జోగేంద్రగా గుర్తించారు. ఆదివారం కావడంతో జోగేంద్ర తన స్నేహితులతో కలిసి ఆడుకుందామని వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతయ్యాడు. స్థానికులు గాలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదు చేశారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

News October 12, 2025

బిహార్‌లో NDA సీట్ల షేరింగ్‌.. ఏ పార్టీకి ఎన్నంటే?

image

బిహార్‌లో NDA సీట్ల షేరింగ్‌‌ను ఆ రాష్ట్ర బీజేపీ ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. మొత్తం 243 సీట్లలో బీజేపీకి 101, JDU 101, LJP (R) 29, రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM)కి 6, హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM)కు 6 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ NDA ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలో రెండు విడతల్లో(నవంబర్ 6, 11 తేదీల్లో) ఎన్నికలు జరగనున్నాయి.

News October 12, 2025

‘విశాఖ స్ఫూర్తితో బాలాజీ రైల్వే డివిజన్‌ సాధించుకుందాం’

image

రాజకీయాలకు అతీతంగా <<17977459>>బాలాజీ రైల్వే డివిజన్‌<<>>ను సాధించుకుందామని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో దీనిపై ఆదివారం సమావేశం జరిగింది. ఇందులో భాగంగా బాలాజీ రైల్వే డివిజన్‌ ఆవశ్యకతను పలువురు నొక్కి చెప్పారు. విశాఖ ఉక్కు స్ఫూర్తితో బాలాజీ రైల్వే డివిజన్ సాధించికుందామని వారు పిలుపునిచ్చారు.