News October 12, 2025
సిద్దిపేట: ధాన్యం ఆరబెట్టే యంత్రాలతో రైతులకు తప్పనున్న తిప్పలు

పండించిన పంటలను విక్రయించే సమయంలో తేమ శాతం తగ్గించేందుకు రైతులు యుద్ధం చేయాల్సి వస్తోంది. దీంతో రైతుల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ప్రయోగాత్మకంగా ఆటోమేటిక్ డ్రయర్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలి విడతలో ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ప్రతి జిల్లాకు 2 నుంచి 4 డ్రయర్లను కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం ప్రవీణ్ వెల్లడించారు.
Similar News
News October 12, 2025
జగిత్యాల: విద్యా, వైద్యం ప్రభుత్వ బాధ్యత: ఎమ్మెల్సీ

జగిత్యాల పట్టణంలోని మిలాత్ ఇస్లామియా కమిటీ సభ్యులు ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. విద్యా, వైద్యం రెండూ ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ప్రభుత్వం ఎంత చేసినప్పటికీ, సామాజిక సేవలు కూడా అవసరమన్నారు. ప్రభుత్వపరంగా పొందలేని సేవలను ఆరోగ్యశ్రీ ద్వారా పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
News October 12, 2025
‘1100’ సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ‘1100’ సేవలను వినియోగించుకోవాలని తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. అర్జీదారుల సమస్యలు పరిష్కార కాకపోతే ఈ నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిరసిస్తామని, Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.
News October 12, 2025
తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌ఛార్జ్ రేసులోకి కొత్త పేర్లు?

తంబళ్లపల్లి నియోజకవర్గంలో మొరుసుకాపుల ఓట్లే కీలకం. 60 వేలకుపైగా ఉన్న ఈ వర్గం తరఫున సీపీ సుబ్బారెడ్డి, చల్లపల్లి నరసింహారెడ్డి ఇద్దరూ టీడీపీ ఇన్‌ఛార్జ్ పదవికి రేసులో ఉన్నట్లు సమాచారం. నరసింహారెడ్డి గతంలో కూటమి అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప తేడాతో ఓడి పోయిన బలమైన క్యాడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు సుబ్బారెడ్డికి కూడా ఆ సత్తా ఉందని ఆయన కార్యకర్తలు పేర్కొంటున్నారు.