News October 12, 2025
వరంగల్: జీవాంజీ దీప్తికి గోల్డ్ మెడల్..!

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరుగుతున్న వర్ట్చూస్ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్- 2025లో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన పారా అథ్లెట్ జీవాంజీ దీప్తి గోల్డ్ మెడల్ సాధించారు. మూడు రోజులుగా జరుగుతున్న పోటీల్లో శనివారం క్వాలిఫైయింగ్ రౌండ్ పూర్తి చేయగా, ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో దీప్తిని కోచ్‌తో పాటు తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందించారు.
Similar News
News October 12, 2025
లింగంపేట: దుబాయ్‌లో యువకుడి సూసైడ్

లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన మన్నె సంగమేశ్ దుబాయ్‌లో సూసైడ్ చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మన్నే సంగమేష్ 2024 అక్టోబర్‌లో దుబాయ్‌లో వర్కింగ్ లేబర్‌గా పని చేయడానికి వెళ్లాడు. శనివారం అతను ఉండే గదిలో బాత్రూంలో ఉరేసుకొని చనిపోయాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
News October 12, 2025
శ్రీకాకుళం జిల్లాకు వర్ష సూచన

గత కొన్ని రోజులుగా వర్షాలతో సతమతం అవుతున్న శ్రీకాకుళం జిల్లాకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం రాబోయే 2-3 గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని APSDMA ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
News October 12, 2025
92 ఏళ్లు.. మరోసారి ఎన్నికల్లో పోటీ

ఆఫ్రికా దేశం కామెరూన్ అధ్యక్షుడు పాల్ బియా 92 ఏళ్ల వయసులో మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇవాళ అక్కడ ఎలక్షన్స్ స్టార్ట్ కాగా కామెరూన్ పీపుల్స్ డెమోక్రటిక్ మూమెంట్ పార్టీ తరఫున బరిలోకి దిగారు. గెలిస్తే ఏడేళ్ల పాటు అధికారంలో కొనసాగనున్నారు. 2.90కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి ఇప్పటి వరకు ఇద్దరే అధ్యక్షులుగా ఉన్నారు. 1960 నుంచి 82 వరకు అహ్మద్ అహిద్జో, ఆ తర్వాత బియా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.