News October 12, 2025

ప్రజల్లో ‘కల్తీ’ భయం!

image

దేశంలో కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు అద్దం పడుతున్నాయి. ఇప్పటివరకు పాలు, మద్యం, నిత్యవసరాలు, మెడిసిన్ కల్తీ అవడం చూస్తోండగా తాజాగా <<17975023>>Colgate<<>> ఘటన కలవరపరుస్తోంది. పనీర్, ఈనో, సెన్సోడైన్ వంటివి కూడా కల్తీ అవడం ఈ మధ్యకాలంలో వెలుగుచూశాయి. రసాయనాలు, నాసిరకం పదార్థాలతో వీటి తయారీ ప్రాణాలపైకి తీసుకొస్తుంది. దీంతో ఏది కల్తీనో ఏదీ నిజమైనదో తెలియక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Similar News

News October 12, 2025

92 ఏళ్లు.. మరోసారి ఎన్నికల్లో పోటీ

image

ఆఫ్రికా దేశం కామెరూన్ అధ్యక్షుడు పాల్ బియా 92 ఏళ్ల వయసులో మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇవాళ అక్కడ ఎలక్షన్స్ స్టార్ట్ కాగా కామెరూన్ పీపుల్స్ డెమోక్రటిక్ మూమెంట్ పార్టీ తరఫున బరిలోకి దిగారు. గెలిస్తే ఏడేళ్ల పాటు అధికారంలో కొనసాగనున్నారు. 2.90కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి ఇప్పటి వరకు ఇద్దరే అధ్యక్షులుగా ఉన్నారు. 1960 నుంచి 82 వరకు అహ్మద్ అహిద్జో, ఆ తర్వాత బియా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

News October 12, 2025

బిహార్‌లో NDA సీట్ల షేరింగ్‌.. ఏ పార్టీకి ఎన్నంటే?

image

బిహార్‌లో NDA సీట్ల షేరింగ్‌‌ను ఆ రాష్ట్ర బీజేపీ ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. మొత్తం 243 సీట్లలో బీజేపీకి 101, JDU 101, LJP (R) 29, రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM)కి 6, హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM)కు 6 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ NDA ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలో రెండు విడతల్లో(నవంబర్ 6, 11 తేదీల్లో) ఎన్నికలు జరగనున్నాయి.

News October 12, 2025

బంగారు పల్లకీలో ఊరేగించి.. కలెక్టరుకు వీడ్కోలు

image

తమ సేవలతో ప్రజల గుండెల్లో స్థానం పొందే అధికారులను చాలాఅరుదుగా చూస్తుంటాం. వారిలో ఒకరే మధ్యప్రదేశ్ సియోని జిల్లా కలెక్టర్‌ సంస్కృతి జైన్‌. ఆమె బదిలీ సందర్భంగా బంగారు పల్లకీలో కూర్చోబెట్టి మరీ వీడ్కోలు పలికారు సిబ్బంది. గిఫ్ట్ ఎ డెస్క్ ప్రోగ్రాం, అనేక ప్రజోపయోగ కార్యక్రమాలతో ఈ కలెక్టర్ ప్రజలకు చేరువై ప్రశంసలు దక్కించుకున్నారు. ఉద్యోగంలో ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలిచారు.