News October 12, 2025
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు ఆహ్వానం

జాతీయ స్థాయిలో జరిగే సైనిక్ స్కూల్ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 6వ తరగతికి 01.04.2014 నుంచి 31.03.2016 మధ్య జన్మించి ఉండాలి. 9 వ తరగతి ప్రవేశాలకు 01.04.2011 నుంచి 31.03.2013 మధ్య పుట్టిన వారు అర్హులు. ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Similar News
News October 12, 2025
అనుమతులు లేకుండా టపాసులు విక్రయించరాదు: నిర్మల్ ఎస్పీ

రాబోయే దీపావళి పండుగను ప్రజలందరూ ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల సూచించారు. బాణాసంచా విక్రయాల కోసం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా దుకాణాలు ఏర్పాటు చేసినా, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా విక్రయాలు జరిపినా, ప్రేలుడు పదార్థాల చట్టం (Explosives Act) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
News October 12, 2025
ఏలూరు జిల్లా వ్యాప్తంగా శక్తి టీం విజిబుల్ పోలీసింగ్

ఏలూరు జిల్లా వ్యాప్తంగా నాలుగు సబ్ డివిజన్ల పరిధిలో శక్తి టీం సభ్యులు ఆదివారం సాయంత్రం ‘విజిబుల్ పెట్రోలింగ్’ నిర్వహించారు. మహిళలకు భరోసా కల్పిస్తూ, 112 ఫోన్ నెంబర్, ‘శక్తి యాప్’ ఆవశ్యకతను వివరించినట్లు శక్తి టీం ఇన్‌చార్జి సుబ్బారావు తెలిపారు. విద్యార్థులకు, మహిళలకు శక్తి టీం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఐ భరోసా ఇచ్చారు.
News October 12, 2025
HNK కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం

హనుమకొండ కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీశ్ తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాల్‌లో ప్రజావాణి నిర్వహిస్తామన్నారు. ప్రజల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీలను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.