News October 12, 2025
పంజాగుట్ట యాక్సిడెంట్ మృతిచెందింది వీరే!

పంజాగుట్ట PS పరిధిలోని గ్రీన్ ల్యాండ్స్ వద్ద తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈప్రమాదంలో రాపిడో డ్రైవర్ ముద్ధంగల్ నవీన్(30) అక్కడికక్కడే మృతి చెందగా.. వెనుక సవారీ చేసిన డాక్టర్ కస్తూరి జగదీష్ చంద్ర(35) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసులు లారీ డ్రైవర్ శంకర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 12, 2025
లింగంపేట: దుబాయ్‌లో యువకుడి సూసైడ్

లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన మన్నె సంగమేశ్ దుబాయ్‌లో సూసైడ్ చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మన్నే సంగమేష్ 2024 అక్టోబర్‌లో దుబాయ్‌లో వర్కింగ్ లేబర్‌గా పని చేయడానికి వెళ్లాడు. శనివారం అతను ఉండే గదిలో బాత్రూంలో ఉరేసుకొని చనిపోయాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
News October 12, 2025
శ్రీకాకుళం జిల్లాకు వర్ష సూచన

గత కొన్ని రోజులుగా వర్షాలతో సతమతం అవుతున్న శ్రీకాకుళం జిల్లాకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం రాబోయే 2-3 గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని APSDMA ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
News October 12, 2025
92 ఏళ్లు.. మరోసారి ఎన్నికల్లో పోటీ

ఆఫ్రికా దేశం కామెరూన్ అధ్యక్షుడు పాల్ బియా 92 ఏళ్ల వయసులో మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇవాళ అక్కడ ఎలక్షన్స్ స్టార్ట్ కాగా కామెరూన్ పీపుల్స్ డెమోక్రటిక్ మూమెంట్ పార్టీ తరఫున బరిలోకి దిగారు. గెలిస్తే ఏడేళ్ల పాటు అధికారంలో కొనసాగనున్నారు. 2.90కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి ఇప్పటి వరకు ఇద్దరే అధ్యక్షులుగా ఉన్నారు. 1960 నుంచి 82 వరకు అహ్మద్ అహిద్జో, ఆ తర్వాత బియా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.