News October 12, 2025

HYD: పెద్దాసుపత్రి.. డెడ్‌బాడీలు ఫ్రీగా పంపలేని పరిస్థితి!

image

HYD గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల నుంచి డెడ్ బాడీలను ఇంటికి తీసుకెళ్లే కష్టాలు తప్పటం లేదు. ఉస్మానియాలో నిత్యం 25 నుంచి 35 మంది మరణిస్తున్నారు. కానీ.. ఉచిత అంబులెన్స్ సేవలు సరైన సంఖ్యలో లేకపోవడంతో కడచూపు కష్టంగా మారుతోంది. వేలు ఖర్చు పెట్టీ డెడ్‌బాడీని ప్రైవేట్ అంబులెన్స్ వాహనాల్లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఒక్కో ఆస్పత్రికి 20 ఉచిత అంబులెన్సులు అందుబాటులోకి తేవాలని బాధితులు కోరుతున్నారు.

Similar News

News October 12, 2025

‘రంజీ’ తెచ్చిన హైదరాబాదీ!

image

సిటీలో‌నే పుట్టి, పెరిగారు ఆయన. క్రికెట్ అంటే ఆసక్తి. పుట్టిన గడ్డ పేరు నిలబెట్టాలని గట్టి నిర్ణయం తీసుకున్నారేమో మరి. దేశవాలీ క్రికెట్‌లో మన హైదరాబాద్‌ పేరును మారుమోగించారు. ఆయనే నవాబ్ సయ్యద్ మొహమ్మద్ హుస్సేన్. నిజాం కాలేజీలో చదివిన ఆయన క్రికెట్‌లో రాణించారు. ఆయన ప్రతిభతో రంజీ ట్రోఫీ ఛాంపియన్‌షిప్‌‌లో హైదరాబాద్‌కు సారథి అయ్యారు. ఈయన కెప్టెన్సీలోనే (1937-38) రంజీ 3వ టైటిల్‌‌ను HYD గెలిచింది.

News October 12, 2025

జూబ్లీహిల్స్‌‌ బైపోల్‌.. ఓటర్ 50-50!

image

HYDలో ఎన్నికలు అంటే నేతల్లో హడావిడి మామూలుగా ఉండదు. ప్రచారంలో పోటాపోటీ కనిపిస్తుంది. కానీ, ఇంత ఆర్భాటం చేసినా ఓటరు మహాశయులు సిటీలో ఎలక్షన్స్ అంటే దూరంగా ఉంటారు. జూబ్లీహిల్స్‌‌లో ఈ పరిస్థితి మరీ ఎక్కువ. 2023 ఎన్నికల్లోనూ ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు కృషి చేసినా 50% శాతానికే పరిమితం అయ్యింది. ఇక ఈ బైపోల్‌‌లో అయినా ఓటర్లు పోలింగ్‌‌కు వస్తారా? ఎప్పటిలాగే 50-50 అంటారా అనేది వేచి చూడాల్సిందే.

News October 12, 2025

HYD: CM బోటీ అమ్ముతుండా?: KTR

image

కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు KCRను గెలిపించుకోవాలని KTR పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచే BRS జైత్రయాత్ర మొదలవ్వాలన్నారు. 2 ఏళ్లు అభివృద్ధిని పక్కన బెట్టిన రేవంత్ KCRను తిట్టుడే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ‘గుడ్లు పీకి గోలిలాడుతా.. పేగులు మెడలేసుకుంటా అంటుండు. CM బోటీ ఏమైనా అమ్ముతుండా’ అని KTR సెటైర్లు వేశారు. కారు కావాలా? బుల్డోజర్‌ కావాలో నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు.