News October 12, 2025
పాప్ స్టార్‌తో కెనడా మాజీ ప్రధాని డేటింగ్!

అమెరికన్ పాప్ సింగర్ కేటీ పెర్రీతో కెనడా Ex PM జస్టిన్ ట్రూడో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. US కాలిఫోర్నియాలో ఓ బోటులో విహరిస్తుండగా పెర్రీని ట్రూడో కిస్ చేస్తున్న ఫొటో వైరల్ అవుతోంది. గత జులైలో డిన్నర్ డేట్ సందర్భంగా వీరు తొలిసారి కలిసి కనిపించారు. 2023లో భార్య సోఫీ నుంచి ట్రూడో విడిపోగా, నటుడు ఒర్లాండోతో నిశ్చితార్థాన్ని 2025 జూన్‌లో పెర్రీ రద్దు చేసుకున్నారు.
Similar News
News October 12, 2025
తీవ్ర విషాదం.. ఐదుగురు మృతి

AP: రాష్ట్రంలో పలు చోట్ల విషాద ఘటనలు నెలకొన్నాయి. బాపట్ల జిల్లా చీరాల(M) వాడరేవు సముద్ర తీరంలో స్నానం చేస్తూ అలల తాకిడికి ఐదుగురు గల్లంతయ్యారు. నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొకరి కోసం పోలీసులు, మత్స్యకారులు గాలిస్తున్నారు. అటు కడప(D) కమలాపురంలో ఈతకు వెళ్లి ఈర్ల సుకన్య(11) అనే బాలిక చనిపోగా, అన్నమయ్య(D) మదనపల్లెలో సాయికృష్ణ(15) అనే విద్యార్థి హంద్రీనీవా కాలువలో గల్లంతయ్యాడు.
News October 12, 2025
92 ఏళ్లు.. మరోసారి ఎన్నికల్లో పోటీ

ఆఫ్రికా దేశం కామెరూన్ అధ్యక్షుడు పాల్ బియా 92 ఏళ్ల వయసులో మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇవాళ అక్కడ ఎలక్షన్స్ స్టార్ట్ కాగా కామెరూన్ పీపుల్స్ డెమోక్రటిక్ మూమెంట్ పార్టీ తరఫున బరిలోకి దిగారు. గెలిస్తే ఏడేళ్ల పాటు అధికారంలో కొనసాగనున్నారు. 2.90కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి ఇప్పటి వరకు ఇద్దరే అధ్యక్షులుగా ఉన్నారు. 1960 నుంచి 82 వరకు అహ్మద్ అహిద్జో, ఆ తర్వాత బియా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
News October 12, 2025
బిహార్‌లో NDA సీట్ల షేరింగ్.. ఏ పార్టీకి ఎన్నంటే?

బిహార్‌లో NDA సీట్ల షేరింగ్‌ను ఆ రాష్ట్ర బీజేపీ ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. మొత్తం 243 సీట్లలో బీజేపీకి 101, JDU 101, LJP (R) 29, రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM)కి 6, హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM)కు 6 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ NDA ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలో రెండు విడతల్లో(నవంబర్ 6, 11 తేదీల్లో) ఎన్నికలు జరగనున్నాయి.