News October 12, 2025

పున్నమి ఘాట్‌లో గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్

image

GST 2.0 సంస్కరణలతో ప్రజలకు జరుగుతున్న ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశా వివరించారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 13 నుంచి 19వ తేదీ వరకు ఇబ్రహీంపట్నంలోని పున్నమి ఘాట్‌లో గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. వ్యాపారులు, హస్త కళాకారులు వస్తు విక్రయాలు చేస్తారన్నారు.

Similar News

News October 12, 2025

ఏడు వారాల నగలను ఎందుకు ధరించేవారు?

image

పూర్వం అలంకరణ కోసమే కాక ఆధ్యాత్మిక శక్తి, ఆరోగ్య సంపద కోసం స్త్రీలు ఆభరణాలు ధరించేవారు. నేటి రత్నపు ఉంగరాల మాదిరిగానే, ఒకప్పుడు గ్రహాలను శాంతింపజేయడానికి రోజుకో రకమైన ఆభరణాలను ధరించేవారు. వీటినే ఏడువారాల నగలు అంటారు. ఆయా వారాలకు ఆధిపత్యం వహించే గ్రహాలకి ఆయా రోజుల్లో ప్రీతికరమైన నగలు ధరిస్తే.. సానుకూల శక్తి లభిస్తుందని భావిస్తారు. బంగారం రోజూ శరీర భాగాలను తాకడం ద్వారా ఆరోగ్యం మెరుగవుతుందని నమ్మకం.

News October 12, 2025

కరీంనగర్: ‘శబరిమలలో బంగారం చోరీపై చర్యలు తీసుకోవాలి’

image

శబరిమలలో బంగారం చోరీపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు కరీంనగర్ జిల్లా అయ్యప్ప సేవా సమితి వినతిపత్రం అందజేశారు. శబరిమల ధర్మశాస్త్ర దేవస్థానంలో బంగారం చోరీ ఆస్తుల దుర్వినియోగం విషయంలో TDB బోర్డు నిబంధనల ఉల్లంఘనపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సీబీఐ పర్యవేక్షణలో ఆలయ ఆస్తులపై ఆడిట్ చేయాలని కోరారు.

News October 12, 2025

ఏడు వారాల నగలు ఇవే..

image

ఆదివారము – సూర్యుని కోసం కెంపుల కమ్మలు, హారాలు
సోమవారము – చంద్రుని కోసం ముత్యాల హారాలు, ముత్యాల గాజులు
మంగళవారము – కుజుని కోసం పగడాల దండలు, ఉంగరాలు
బుధవారము – బుధుని కోసం పచ్చల పతకాలు, గాజులు
గురువారము – బృహస్పతి కోసం పుష్యరాగము, కమ్మలు, ఉంగరాలు
శుక్రవారము – శుక్రుని కోసం వజ్రాల హారాలు, వజ్రపు ముక్కుపుడక
శనివారము – శని కోసం నీలమణి హారాలు