News October 12, 2025

Op Sindoor: NSEపై ఒకేరోజు 40 కోట్ల సైబర్ అటాక్స్

image

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)పై రోజూ 17కోట్ల సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ టైమ్‌లో ఏకంగా ఒకేరోజు 40 కోట్ల దాడులు జరిగాయి. వీటిని సమర్థంగా అడ్డుకున్నామని, ఎలాంటి నష్టం జరగలేదని NSE వర్గాలు తెలిపాయి. తమ రెండు సైబర్ డిఫెన్స్ సెంటర్లలోని సాంకేతిక బృందాలు 24/7 పని చేస్తున్నట్లు చెప్పాయి. Op Sindoor సమయంలో తమ సైట్‌ను ఫారినర్స్ యాక్సెస్ చేయకుండా తాత్కాలికంగా రిస్ట్రిక్ట్ చేశామన్నాయి.

Similar News

News October 12, 2025

ఏడు వారాల నగలను ఎందుకు ధరించేవారు?

image

పూర్వం అలంకరణ కోసమే కాక ఆధ్యాత్మిక శక్తి, ఆరోగ్య సంపద కోసం స్త్రీలు ఆభరణాలు ధరించేవారు. నేటి రత్నపు ఉంగరాల మాదిరిగానే, ఒకప్పుడు గ్రహాలను శాంతింపజేయడానికి రోజుకో రకమైన ఆభరణాలను ధరించేవారు. వీటినే ఏడువారాల నగలు అంటారు. ఆయా వారాలకు ఆధిపత్యం వహించే గ్రహాలకి ఆయా రోజుల్లో ప్రీతికరమైన నగలు ధరిస్తే.. సానుకూల శక్తి లభిస్తుందని భావిస్తారు. బంగారం రోజూ శరీర భాగాలను తాకడం ద్వారా ఆరోగ్యం మెరుగవుతుందని నమ్మకం.

News October 12, 2025

ఏడు వారాల నగలు ఇవే..

image

ఆదివారము – సూర్యుని కోసం కెంపుల కమ్మలు, హారాలు
సోమవారము – చంద్రుని కోసం ముత్యాల హారాలు, ముత్యాల గాజులు
మంగళవారము – కుజుని కోసం పగడాల దండలు, ఉంగరాలు
బుధవారము – బుధుని కోసం పచ్చల పతకాలు, గాజులు
గురువారము – బృహస్పతి కోసం పుష్యరాగము, కమ్మలు, ఉంగరాలు
శుక్రవారము – శుక్రుని కోసం వజ్రాల హారాలు, వజ్రపు ముక్కుపుడక
శనివారము – శని కోసం నీలమణి హారాలు

News October 12, 2025

తీవ్ర విషాదం.. ఐదుగురు మృతి

image

AP: రాష్ట్రంలో పలు చోట్ల విషాద ఘటనలు నెలకొన్నాయి. బాపట్ల జిల్లా చీరాల(M) వాడరేవు సముద్ర తీరంలో స్నానం చేస్తూ అలల తాకిడికి ఐదుగురు గల్లంతయ్యారు. నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొకరి కోసం పోలీసులు, మత్స్యకారులు గాలిస్తున్నారు. అటు కడప(D) కమలాపురంలో ఈతకు వెళ్లి ఈర్ల సుకన్య(11) అనే బాలిక చనిపోగా, అన్నమయ్య(D) మదనపల్లెలో సాయికృష్ణ(15) అనే విద్యార్థి హంద్రీనీవా కాలువలో గల్లంతయ్యాడు.