News October 12, 2025

మామిడి.. అక్టోబర్‌లో తీసుకోవాల్సిన చర్యలు

image

మామిడిలో కొమ్మ ఎండు, ఆకు మచ్చ తెగుళ్ల నివారణకు ఈనెలలో పలు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముందుగా చెట్లకు నీరు పెట్టడం ఆపేయాలి. ఎండిన కొమ్మలు, ఆకులను పూర్తిగా తొలగించాలి. చెట్లకు ఉన్న చెదలును తొలగించి మొదళ్లలో క్లోరిఫైరిఫాస్ నేల బాగా తడిచేలా పోయాలి. కాండం 1 మీటరు ఎత్తువరకు క్లోరిఫైరిఫాస్‌ను పూతలాగా పూయాలి. అలాగే లీటరు నీటికి 1గ్రా.కార్బండిజమ్ కలిపి పిచికారీ చేసుకోవాలి.

Similar News

News October 12, 2025

బెల్ట్ షాపులు నిర్వహిస్తే బెల్ట్ తీస్తాం: చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో ఎక్కడైనా బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మితే బెల్ట్ తీస్తామని CM CBN హెచ్చరించారు. నకిలీ మద్యం కేసుకు సంబంధించి నెల్లూరు రేంజ్ IG అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశామన్నారు. వ్యాపారం పేరుతో నకిలీ మద్యం తయారు చేస్తామంటే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు కల్తీ మద్యాన్ని గుర్తించేందుకు ‘AP ఎక్సైజ్ సురక్షా యాప్‌’ను రిలీజ్ చేశారు. యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా యాప్‌ను తీర్చిదిద్దామన్నారు.

News October 12, 2025

వేరుశనగలో ఇనుపధాతులోపం.. నివారణ

image

ఆకులలో పత్రహరితం తయారవడానికి ఇనుపధాతు కీలకం. ఇది లోపించినప్పుడు వేరుశనగ మొక్క ఆకులు పసుపు రంగుకు మారతాయి. క్రమంగా ఆకు కొనలు ఎండిపోతాయి. మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. ఈ సమస్య నివారణకు 0.5 శాతంఅన్నబేధి(5గ్రా. లీటరు నీటికి), 0.1 శాతం నిమ్మఉప్పు(లీటరు నీటికి 1గ్రాము) కలిపిన ద్రావణాన్ని 4-5 రోజుల వ్యవధిలో 2-3సార్లు పిచికారీ చేసుకోవాలి.

News October 12, 2025

ఏడు వారాల నగలను ఎందుకు ధరించేవారు?

image

పూర్వం అలంకరణ కోసమే కాక ఆధ్యాత్మిక శక్తి, ఆరోగ్య సంపద కోసం స్త్రీలు ఆభరణాలు ధరించేవారు. నేటి రత్నపు ఉంగరాల మాదిరిగానే, ఒకప్పుడు గ్రహాలను శాంతింపజేయడానికి రోజుకో రకమైన ఆభరణాలను ధరించేవారు. వీటినే ఏడువారాల నగలు అంటారు. ఆయా వారాలకు ఆధిపత్యం వహించే గ్రహాలకి ఆయా రోజుల్లో ప్రీతికరమైన నగలు ధరిస్తే.. సానుకూల శక్తి లభిస్తుందని భావిస్తారు. బంగారం రోజూ శరీర భాగాలను తాకడం ద్వారా ఆరోగ్యం మెరుగవుతుందని నమ్మకం.