News October 12, 2025

నా కూతురికి రక్షణ లేదు.. రేప్ బాధితురాలి తండ్రి ఆందోళన

image

పశ్చిమ బెంగాల్‌లో తన కూతురి భద్రత గురించి ఆందోళనగా ఉందని <<17979948>>గ్యాంగ్‌రేప్‌<<>> బాధితురాలి తండ్రి వాపోయారు. ‘నా బిడ్డ ప్రస్తుతం నడవలేకపోతోంది. డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మమ్మల్ని ఒడిశాకు వెళ్లనివ్వండి. అక్కడే తను సురక్షితంగా ఉండగలదు’ అని చెప్పారు. కాగా ఫ్రెండ్‌తో కలిసి బయటకు వెళ్లిన మెడికల్ స్టూడెంట్‌పై ముగ్గురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Similar News

News October 12, 2025

మా పార్టీ వాళ్లనూ సస్పెండ్ చేశాం: చంద్రబాబు

image

AP: కొందరు రాజకీయ ముసుగులో నేరాలు చేయడానికి అలవాటు పడ్డారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ‘నకిలీ మద్యం కేసులో మా పార్టీ వాళ్లపై ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేశాం. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటివరకు 23 మంది నిందితులను గుర్తించాం. 16 మందిని అరెస్ట్ చేశాం. ఇబ్రహీంపట్నం కేసులోనూ 12 మంది నిందితులను గుర్తించగా ఏడుగురిని అరెస్టు చేశారు. 4 పీటీ వారెంట్‌లు నమోదయ్యాయి’ అని సీఎం వివరించారు.

News October 12, 2025

బెల్ట్ షాపులు నిర్వహిస్తే బెల్ట్ తీస్తాం: చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో ఎక్కడైనా బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మితే బెల్ట్ తీస్తామని CM CBN హెచ్చరించారు. నకిలీ మద్యం కేసుకు సంబంధించి నెల్లూరు రేంజ్ IG అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశామన్నారు. వ్యాపారం పేరుతో నకిలీ మద్యం తయారు చేస్తామంటే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు కల్తీ మద్యాన్ని గుర్తించేందుకు ‘AP ఎక్సైజ్ సురక్షా యాప్‌’ను రిలీజ్ చేశారు. యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా యాప్‌ను తీర్చిదిద్దామన్నారు.

News October 12, 2025

వేరుశనగలో ఇనుపధాతులోపం.. నివారణ

image

ఆకులలో పత్రహరితం తయారవడానికి ఇనుపధాతు కీలకం. ఇది లోపించినప్పుడు వేరుశనగ మొక్క ఆకులు పసుపు రంగుకు మారతాయి. క్రమంగా ఆకు కొనలు ఎండిపోతాయి. మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. ఈ సమస్య నివారణకు 0.5 శాతంఅన్నబేధి(5గ్రా. లీటరు నీటికి), 0.1 శాతం నిమ్మఉప్పు(లీటరు నీటికి 1గ్రాము) కలిపిన ద్రావణాన్ని 4-5 రోజుల వ్యవధిలో 2-3సార్లు పిచికారీ చేసుకోవాలి.