News October 12, 2025

ఉచితాలు కాదు.. భవిష్యత్ కావాలన్నారు: పవన్

image

AP: తిత్లీ తుఫాను సమయంలో శ్రీకాకుళం యువతను పరామర్శించానని, వాళ్లతో జరిగిన సంభాషణ గుర్తుందని Dy.CM పవన్ పేర్కొన్నారు. ‘వారు ఉచితాలు, సంక్షేమ పథకాలు అడగలేదు. 25 ఏళ్ల మంచి భవిష్యత్ కావాలన్నారు. నిత్యం యువతతో మాట్లాడుతూ ఉంటా. వారి కలలు నిజం చేసేందుకు కృషి చేస్తా’ అని పేర్కొన్నారు. 2018లో పవన్‌తో తన జర్నీ మొదలైందని మంత్రి మనోహర్ ఓ ఫోటోను ట్వీట్ చేయగా దానికి పవన్ పైవిధంగా స్పందించారు.

Similar News

News October 12, 2025

బిగ్‌బాస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్.. ఆరుగురి ఎంట్రీ

image

బిగ్‌బాస్ తెలుగు సీజన్-9 నుంచి ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. హౌస్ నుంచి ఫ్లోరా సైనీ, శ్రీజను ఎలిమినేట్ చేసినట్లు షో నిర్వాహకులు ప్రకటించారు. హౌస్‌లోకి కొత్తగా నిఖిల్ నాయర్ (సీరియల్ యాక్టర్), దివ్వెల మాధురి, శ్రీనివాస్ సాయి (గోల్కొండ హైస్కూల్ సినిమా ఫేమ్), రమ్య మోక్ష (అలేఖ్య చిట్టీ పికిల్స్), అయేషా(సీరియల్ నటి), గౌరవ్ గుప్తా (సీరియల్ నటుడు) వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు.

News October 12, 2025

అంతరిక్షం నుంచి హిమాలయాల అందాలు!

image

నాసా వ్యోమగామి డాన్ పెట్టిట్ అంతరిక్షం నుంచి తీసిన హిమాలయ పర్వతాల ఫొటో SMలో వైరల్ అవుతోంది. తెల్లటి మంచు, మేఘాలతో కనుచూపు మేర ఉన్న పర్వతాలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ ఫొటోలో హిమాలయాలతో పాటు ఎవరెస్ట్‌ పర్వతం, నేపాల్ భూభాగం సైతం కనిపిస్తోందని వ్యోమగామి వెల్లడించారు. ఇటీవల బిహార్‌లోని జైనగర్ నుంచి ఎవరెస్టు పర్వత అందాలు కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే.

News October 12, 2025

రేపు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు: APSDMA

image

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు పలు జిల్లాలకు APSDMA వర్షసూచన చేసింది. సోమవారం అల్లూరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.